మంచు మనోజ్ మొదటిసారి ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు మంచు ఫ్యామిలీ మొత్తం మనోజ్ పెళ్లిని సపోర్ట్ చేస్తూ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో సందడి చేసింది. మనోజ్ పెళ్లి కొడుకు అయినదగ్గరనుండి.. మెహిందీ, సంగీత్ ఫంక్షన్ వరకు చాలా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా మంచు ఫ్యామిలీ నిర్వహించింది. మెగాస్టార్ చిరు, బాలకృష్ణ లాంటి వాళ్ళు ఈ పెళ్ళికి హాజరయ్యారు. మనోజ్ తో ఆడిపాడారు. కాని ఈసారి మనోజ్ రెండో పెళ్ళిలో ఏదో తెలియని వెలితి అన్నట్టుగా మంచు ఫ్యామిలీ మనోజ్ పెళ్ళిలో కనిపించడమే లేదు. మంచు లక్ష్మి అన్నీ తానై తమ్ముడి పెళ్లి భుజానకెత్తుకుంది.
తన ఇంట్లోనే మనోజ్ పెళ్లి ఏర్పాట్లు చేసింది. ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మి నివాసంలోనే మంచు మనోజ్-భూమా మౌనిక రెడ్డిల సంగీత్, మెహిందీ వేడుకలతో పాటుగా ఈరోజు పెళ్లి కూడా నిర్వహించబోతున్నారు. ఈ రోజు మార్చి 3 శుక్రవారం ఉదయం భూమా మౌనిక పెళ్లి కూతురు పిక్ షేర్ చేస్తూ పెళ్లి కూతురు అంటూ మనోజ్ తనకి కాబోయే భార్యని పరిచయం చేసాడు. ఆ తర్వాత కొద్ది సేపట్లోనే మనోజ్ పెళ్లి కొడుకు గెటప్ తో ఇచ్చిన ఫోజులు బయటికి వచ్చాయి. మంచు లక్ష్మి పెళ్లి కొడుకు మనోజ్ తో కలిసి సెల్ఫీ దిగిన పిక్, అలాగే పెళ్లి కొడుకుగా రాయల్ గెటప్ లో మనోజ్ ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
ఈరోజు రాత్రి 8.30 నిమిషాలకి భూమా మౌనిక రెడ్డి మెడలో మనోజ్ మూడుముళ్ళు వేసి ఏడడుగులు నడవబోతున్నాడు. మరి రాత్రికల్లా మనోజ్-మౌనిక ల వెడ్డింగ్ పిక్స్ కూడా వచ్చేస్తాయి.. కాస్త వెయిట్ చెయ్యండి.