యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎన్టీఆర్ కి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసిషియన్ వారు అవార్డు ప్రకటించారో, లేదో.. అసలు ఇన్విటేషన్ ఇచ్చారో, లేదో తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో #NTRGoesGlobal అంటూ రచ్చ మొదలు పెట్టేసారు. రామ్ చరణ్ తో పాటు ఉండాల్సిన ఎన్టీఆర్ అమెరికాలో కనిపించకపోయేసరికి ఫాన్స్ కి ఆందోళన స్థానంలో ఆగ్రహం మొదలైంది. అందులోను ఆర్.ఆర్.ఆర్ కి వచ్చిన పలు అవార్డుల స్థానంలో రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి ఇలా అందరి పేర్లు ఉన్నా.. ఎన్టీఆర్ పేరు కనిపించకపోయేసరికి ఎన్టీఆర్ ఫాన్స్ కి మరింత కోపాన్ని తెప్పించింది. ఆర్.ఆర్.ఆర్ ఇద్దరి హీరోల్లో రామ్ చరణ్ అవార్డు అందుకుని ఫోజులు కొడుతుంటే.. ఎన్టీఆర్ ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
అయితే ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళనకి కారణం ఎన్టీఆరే. ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ వచ్చినా ఆయన వ్యక్తిగత కారణాలతో అమెరికాకు అవార్డు అందుకోవడానికి వెళ్ళలేదు. సోదరుడు తారకరత్న మరణంతో ఎన్టీఆర్ వెళ్ళలేదు. ఫాన్స్ అది అర్ధం చేసుకోలేదు. కానీ ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళనని అర్ధం చేసుకున్న HCA ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ పంపిన విషయమై అభిమానులకి క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఫాన్స్ రచ్చ ఆపలేదు. తాజాగా HCA ఓ కీలక ట్వీట్ చేసింది. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ కూల్ అవుతూ సంబరాల్లో మునిగిపోయారు.
అదేమిటంటే అమెరికాకి అవార్డు అందుకోవడానికి రాలేకపోయిన ఎన్టీఆర్ కి తాము HCA అవార్డు వచ్చే వారమే పంపిస్తున్నాము, ఎన్టీఆర్ తో పాటుగా ఆర్.ఆర్.ఆర్ హీరోయిన్ అలియా భట్ కి కూడా HCA అవార్డు పంపిస్తున్నట్లుగా వారి పేర్లతో ఉన్న ట్రోఫీలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ శాంతిస్తున్నారు.