Advertisementt

టాప్ హీరోయిన్స్ కి హోల్సేల్ గా చెక్

Thu 02nd Mar 2023 09:55 PM
sreeleela,rashmika,pooja hegde  టాప్ హీరోయిన్స్ కి హోల్సేల్ గా చెక్
Wholesale check for top heroines టాప్ హీరోయిన్స్ కి హోల్సేల్ గా చెక్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా కనిపించేది పూజా హెగ్డే ఇంకా రశ్మికనే. పూజ హెగ్డే కి వరసగా భారీ డిసాస్టర్ పడడంతో ఆమెకి కాస్త క్రేజ్ తగ్గింది. సౌత్ లో ప్రస్తుతం మహేష్ మూవీ తప్ప పూజ హేగ్డ్ కి మరో ప్రాజెక్ట్ లేదు. ఇక రష్మిక మందన్న.. పాన్ ఇండియా లెవల్లో పుష్ప తో హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమెకి తెలుగులో అవకాశాలు లేవు. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 తప్ప రష్మిక చేతిలో తెలుగు ప్రాజెక్ట్ లేదు. పూజ హెగ్డే-రష్మిక నువ్వా-నేనా అని పోటీపడి.. ఇద్దరూ టాప్ చైర్ విషయంలో దోబూచులాడినా.. ప్రసుతం ఓ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఈ టాప్ హీరోయిన్స్ ఇద్దరికి చెక్ పెట్టేసింది.  

పెళ్లి సందD, ధమాకా చిత్రాలతో టాలీవుడ్ కి దివాళి క్రాకర్ లా దూసుకొచ్చిన శ్రీలీల హవా టాలీవుడ్ లో పెరిగిపోతుంది. శ్రీలీల లైనప్ చూస్తే టాప్ హీరోయిన్స్ కి ఒణుకు వచ్చేంతగా ఆమె డిమాండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీని చుట్టేసింది. ప్రస్తుతం యువ హీరోల సినిమాల్లో నటించేస్తున్న శ్రీలీల బాలయ్య సినిమాలోనూ వన్ అఫ్ ద హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల మహేష్ SSMB28 చిత్రం లో ఓ హీరోయిన్ గా త్వరలోనే సెట్స్ లోకి వెళ్లబోతుంది.

ఇక వరుణ్ తేజ్ తో ఓ ప్రాజెక్ట్, నితిన్ తో ఓ ప్రాజెక్ట్, రామ్ తో ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ , అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి తో, పంజా వైష్ణవ్ తేజ్ తో ఓ మూవీ, ఇప్పుడు విజయ్ దేవరకొండ VD12, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తుంది. అంటే ఏడెనిమిది ప్రాజెక్ట్స్ తో శ్రీలీల కళకళలాడుతుంటే.. ఇప్పుడు ప్రెజెంట్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రీలీల అంటూ మీడియా ఛానల్స్ నుండి.. వెబ్ సైట్స్ వరకు అందరూ ఫిక్స్ చేసి శ్రీలీల పేరుని మోత మోగిస్తున్నారు.

ఛానల్స్, వాళ్ళు, వీళ్ళు అన్నారని కాదులే.. ప్రస్తుతం ఈ యంగ్ హీరోయిన్ హవా చూస్తుంటే ఆమెనే టాప్ హీరోయిన్ అని అనిపించకమానదు. మరి ధమాకా సినిమా శ్రీలీల ని క్రేజీగా మార్చేసింది. రాత్రికి రాత్రే టాప్ హీరోయిన్ ని చేసేసింది.

Wholesale check for top heroines:

Sreeleela check for top heroines

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ