మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ మాజీ హీరోయిన్ సుస్మితా సేన్ హార్ట్ ఎటాక్ కి గురైన విషయం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. అది కూడా సుస్మిత సేన్ స్వయంగా తనకి గుండెపోటు వచ్చినట్లుగా అభిమానులతో పంచుకోవడం ఆమె ఫాన్స్ కి మరింత షాక్ నిచ్చింది. ఎప్పుడూ ఫిట్ గా కనిపించే సుస్మిత వర్కౌట్స్ అవి బాగానే చేస్తుంది. కానీ ఇలా సడన్ గా ఆమెకి హార్ట్ ఎటాక్ రావడం వెనుక కారణాలు, అలాగే తనకి జరిగిన వైద్యం గురించి సుస్మిత తన పోస్ట్ లో వివరించింది.
రెండు రోజుల క్రితం నేను హార్ట్ ఎటాక్ తో సఫర్ అయ్యాను. వెంటనే ఆసుపత్రిలో చేరగా.. డాక్టర్స్ యాంజియోగ్రామ్ చేసి.. గుండెలోపల బ్లాక్స్ ఏర్పడడంతో డాక్టర్స్ స్టెంట్స్ వేశారు. తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని, ఆందోళపడాల్సిన పని లేదని డాక్టర్స్ చెప్పారు. ఈ ప్రమాదం నుండి బయటపడేందుకు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పుడు నేను చాలా బావున్నాను.
అందుకే ఇప్పుడు ఈ పోస్ట్ పెడుతున్నాను, నేను బాగానే ఆరోగ్యంగా ఉన్నాను అన్న న్యూస్ ని నా అభిమానులతో పంచుకోవాలనుకున్నాను.. అందుకే ఈ విషయాన్ని చెప్పాను అంటూ సుస్మిత ట్వీట్ చెయ్యడంతో.. అభిమానులు ఊపిరి పీల్చుకుని ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆమెకి ధైర్యాన్ని చెబుతున్నారు.