నందమూరి తారకరత్న కన్నుమూసి ఈ రోజుకి 13 రోజులు కావడంతో నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని FNCC లో ఆయన పెద్ద కర్మని నిర్వహించారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. నారా చంద్రబాబు నాయుడు వచ్చి తారకరత్న ఫోటో దగ్గర నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, విజయ సాయి రెడ్డి అక్కడే ఉండి ఏర్పాట్లని పర్యవేక్షిస్తూ.. వచ్చిన వాళ్ళని పలకరిస్తున్నారు. తారకరత్న పెద్ద కర్మకి సినీ, రాజకీయ ప్రముఖులు అటెండ్ అయ్యారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి, కూతురు నిష్క తారకరత్న ఫోటో దగ్గర పూలు ఉంచి నమస్కారం చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
ఈ కార్యక్రమానికి కళ్యాణ్ రామ్ అలాగే ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. కళ్యాణ్ తల్లి, కళ్యాణ్ రామ్ లు తారకరత్న ఫోటో దగ్గర పూలు ఉంచి నివాళు అర్పించారు. ఎన్టీఆర్ తన సోదరుడి ఫోటో దగ్గర పూలు వేసి తలని అక్కడ ఆనించి నమస్కారం చేసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ తారకరత్న ఫోటో దగ్గర పూలు వేసేటప్పుడు అక్కడే ఉన్న బాలయ్య వేరేవాళ్లతో మాట్లాడుతూ కనిపించారు. ఇక ఎన్టీఆర్ తారకరత్న బెంగుళూరు ఆసుపత్రిలో ఉన్నపుడు వెళ్లిరావడం, చనిపోయాక ఇంటికి వెళ్లి సోదరుడికి నివాళులర్పించడం, అలాగే అంత్యక్రియల్లో పాల్గొనడం అన్ని అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి చేసాడు.
అయితే తారకరత్న చిన్న కర్మలో ఎన్టీఆర్ కనిపించలేదు. కేవలం కళ్యాణ్ రామ్ తల్లి, కళ్యాణ్ వైఫ్, కళ్యాణ్ రామ్ మత్రమే చిన్న కర్మకి హాజరయ్యారు. ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ.. పెద్దకర్మకి మాత్రం అన్నతో కలిసి హాజరయ్యాడు.