పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలంటూ ఒక్క క్షణం తీరిక లేకుండా తనపని తాను చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. సినిమా షూటింగ్స్ కి కొద్దిగా బ్రేక్ ఇవ్వడం రాజకీయల్లో యాక్టీవ్ అవడం, అలాగే అక్కడ కొద్దిగా గ్యాప్ తీసుకుని షూటింగ్స్ కి హజరవడం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాటల తూటాలని పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటూనే నవ్వుతూ సినిమాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ లో రాబోయే 2024 ఎన్నికల సమయానికి యాత్ర చేపట్టేందుకు ఓ రధాన్ని సిద్ధం చేసి వారాహి అని పేరు పెట్టారు. అది ఎప్పుడెప్పుడు రోడ్డెక్కుతుందా అని జనసైనికులు వెయిటింగ్.
కానీ యాంటీ పార్టీ వాళ్ళు మాత్రం పవన్ వారాహిని ట్రోల్ చేస్తున్నారు. ఏది మొదలు పెట్టి మాట్లాడినా వారు చివరికి వారాహి దగ్గరే ఆగుతున్నారు. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటిస్తుంది అంటూ ఫీలర్లు వదిలి.. ఇప్పుడు అంత చిన్నమ్మాయితో పవన్ కళ్యాణ్ రొమాన్స్ పై ట్రోల్స్ నడుస్తున్నాయంటూ వార్తలు ప్రచురిస్తారు. పవన్ పై యాంటీ గా వైసిపికి మద్దతుగా ఉన్న మీడియా హౌస్ లు. పవన్ కళ్యాణ్ తో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించడం అనేది తప్పట. మరి బాలయ్య, చిరు, నాగార్జున, వెంకీ సరసన వయసు తక్కువ ఉన్న హీరోయిన్స్ నటించారు. దానిని ప్రేక్షకులు ఒప్పుకున్నప్పుడు పవన్ పక్కన శ్రీలీల నటిస్తే తప్పేమిటో పవన్ ఫాన్స్ కి అర్ధమవడం లేదు.
శ్రీలీల హైట్ వెయిట్ కి పవన్ కళ్యాణ్ పక్కన పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కానీ ఇలా పవన్ కళ్యాణ్ యంగ్ బ్యూటీతో రొమాన్స్ చేయడంపై ట్రోల్స్ నడుస్తున్నాయంటూ చెప్పడం ఎంత పద్ధతిగా ఉంది. ఆ న్యూస్ రాసి చివరిలో ముందు వారాహి యాత్ర మొదలు పెట్టు పవన్ అంటూ విమర్శలు చెయ్యడం.. ఎక్కడ దేనిపై మాట్లాడినా, చివరికి వారాహి దగ్గరే ఆగుతున్నారు. సినిమాల విషయంలోకి తెచ్చి రాజకీయాలని సింక్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అనేది పవన్ ఫాన్స్ వాదన.