సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ఫిట్ గా ఉంటారు. చిన్నప్పుడు బాగా వెయిట్ ఉండే మహేష్ హీరోగా మారాక.. ఎప్పుడూ బరువైన పర్సనాలిటీతో లో కనిపించలేదు. చాలా ఫిట్ గా హ్యాండ్ సమ్ గానే కనిపిస్తారు. అయితే మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ తో SSMB28 షూటింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు తదుపరి షెడ్యూల్ లో బిజీ అయ్యింది. మొన్న సోమవారం నుండి కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే మొదలు పెట్టింది టీమ్.
ఈ చిత్రం కోసం మహేష్ బాబు సూపర్ ఫిట్ గా కనిపించడం కోసం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. ఆయన జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఓ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ పిక్ తో పాటుగా Arm day!! 💪 అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ పిక్ లో మహేష్ హెయిర్ స్టయిల్ కొత్తగా కనిపిస్తుండగా.. ఆయన మాత్రం సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నారు. బీస్ట్ మోడ్ లో ఉన్న మహేష్ షాకింగ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోయింది. మహేష్ ఈమధ్యనే స్పెయిన్ వెళ్లి వచ్చారు. తాజాగా ఆయన నటించిన థమ్స్ అప్ యాడ్ ఒకటి రిలీజ్ అయ్యింది. అందులో మహేష్ యాక్షన్ విన్యాసాలు ఫాన్స్ కి పూనకాలు తెప్పించాయి.
ఇక ప్రస్తుతం ఆయన SSMB29 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ తో పూజా హెగ్డే-శ్రీలీల రొమాన్స్ చేస్తున్నారు. శ్రీలీల ప్రస్తుతం SSMB28 సెట్స్ లో జాయిన్ అయినట్లుగా, పూజ హెగ్డే త్వరలోనే రాబోతున్నట్టుగా తెలుస్తుంది.