మంచు మనోజ్ రెండోసారి పెళ్లి కొడుకు అవ్వబోతున్నాడు. మంచు మనోజ్ రెండో పెళ్లి మార్చి 3న అంగరంగ వైభవంగా జరగబోతుంది. మొదటి పెళ్లి విడాకులకు దారి తియ్యడంతో కొన్నేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన మంచు మనోజ్.. మళ్ళీ తన స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డి ప్రేమలో పడి.. రెండో పెళ్ళికి సిద్దమయ్యాడు. మనోజ్-మౌనికల వివాహం మార్చి 3న ఇరు కుటుంబాల వారు గ్రాండ్ గా జరిపేందుకు నిశ్చయించారు.
అయితే మనోజ్ పెళ్ళికి ముందు జరగవలసిన తంతు అంటే.. పెళ్లి కొడుకు సెలెబ్రేషన్స్, పసుపు తంతు, మెహిందీ సెలెబ్రేషన్స్ ఇవన్నీ మంచు ఫ్యామిలిలో సైలెంట్ గా మొదలైనా.. నేడు మెహిందీ సెర్మోని జరగబోతున్నట్టుగా మంచు వారి ఇంటి నుండి ప్రకటన వచ్చింది. ఈ రోజు అంటే మార్చి ఒకటి సాయంత్రం మంచు ఫ్యామిలిలో మెహిందీ సెలెబ్రేషన్స్ జరగబోతున్నాయి. అందుకే మంచి లక్ష్మి తన తమ్ముడు మనోజ్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. May every evil eye go blind. Thadasthu 🥰 @HeroManoj1 అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఈ రోజు సాయంత్రం మెహిందీ సెలెబ్రేషన్స్ , మార్చి 2 అంటే రేపు సాయంత్రం సంగీత్ సెలెబ్రేషన్స్ పూర్తి కాగానే మంచు మనోజ్ మార్చ్ 3న భూమా మౌనికతో ఏడడుగులు నడిచేందుకు రెడీ అవుతాడు.