Advertisementt

సూపర్ స్టార్ కి కొత్త సిస్టర్

Wed 01st Mar 2023 01:15 PM
jeevitha rajasekhar,rajinikanth  సూపర్ స్టార్ కి కొత్త సిస్టర్
Jeevitha Rajasekhar as Superstar sister సూపర్ స్టార్ కి కొత్త సిస్టర్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ సిస్టర్ కేరెక్టర్ లో కనిపించింది. చెల్లెలి కోసం ప్రాణలించేంతగా రజిని ఆ సినిమాలో కనిపించారు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ కి కొత్త సిస్టర్ రాబోతుంది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో మార్చి 7న మొదలు కాబోతున్న లాల్ సలాం చిత్రంలో రజినీకాంత్ కి చెల్లెలిగా ఒకప్పటి నటి జీవిత రాజశేఖర్ నటించబోతుంది. జీవిత రాజశేఖర్ లాల్ సలాంలో నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. సినిమాలో కీలకమైన రజినీకాంత్, జీవిత రాజశేఖర్, విష్ణు విశాల్ లకి వెల్ కమ్ చెబుతూ మూవీ యూనిట్‌ ట్వీట్‌ చేసింది.

రాజశేఖర్ కి భార్య గా మారకముందే జీవిత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. రాజశేఖర్ కి భార్య అయ్యాక ఇద్దరి బిడ్డల పెంపకంలో జీవిత 30 ఏళ్ళకి ముందు నటన నుంచి బ్రేక్ తీసుకుంది. తర్వాత భర్త రాజశేఖర్ సినిమాలకి డైరెక్షన్ చేస్తున్న జీవిత 30 ఏళ్ళ తర్వాత సూపర్ స్టార్ కి సిస్టర్ కేరెక్టర్ తో రీఎంట్రీ ఇవ్వబోతుంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఏకంగా సూపర్‌ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించేందుకు జీవిత రెడీ అయ్యింది.

ఇక జీవిత రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా హీరోయిన్స్ గా మారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక మంచి బ్రేక్ కోసం వారు వెయిట్ చేస్తున్నారు.

Jeevitha Rajasekhar as Superstar sister:

Jeevitha Rajasekhar as Rajinikanth sister

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ