Advertisementt

ఎన్టీఆర్ కూడా లైట్ తీసుకున్నాడా?

Wed 01st Mar 2023 11:37 AM
jr ntr,rrr  ఎన్టీఆర్ కూడా లైట్ తీసుకున్నాడా?
Did NTR also take the light? ఎన్టీఆర్ కూడా లైట్ తీసుకున్నాడా?
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ లో జరిగిన దురదృష్టకర ఘటనతో ఆయన అమెరికా వెళ్లలేకపోయినట్లుగా HCA వారు ఎన్టీఆర్ ఫాన్స్ ని కూల్ చేసారు లేదంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ లేదేమో అని, ఆర్.ఆర్.ఆర్ టీమ్ అంతా అమెరికాలో అవార్డుల వేడుకలో సందడి చేస్తుంటే.. ఎన్టీఆర్ కనిపించకపోవడంతో ఫాన్స్ ఆందోళనకి గురయ్యారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పేరు లేకుండానే రామ్ చరణ్ ఒక్కడి పేరే మార్మోగిపోవడం ఎన్టీఆర్ ఫాన్స్ కి కునుకు రావటం లేదు. ఇక రామ్ చరణ్ అక్కడ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ గెలుచుకోవడం, అలాగే ఆర్.ఆర్.ఆర్ పలు విభాగాల్లో అవార్డుని గెలుచుకోవడంతో రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణిలు ఆ అవార్డులని అందుకుంటూ ఫొటోలకి ఫోజులిచ్చారు.

ఆ తరవాత చిరు దగ్గర నుండి, పవన్ కళ్యాణ్ వరకు రామ్ చరణ్ ని ప్రతి ఒక్క సినిమా సెలెబ్రిటీ పొగిడేశారు. ఆ అభినందనల్లో ఎన్టీఆర్ పేరు వినిపించకపోవడంపై ఎన్టీఆర్ కూడా బాధపడుతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందుకే ఎన్టీఆర్ ఎలాంటి ఉత్సాహం చూపించకుండా, ఆర్.ఆర్.ఆర్ గెల్చుకున్న అవార్డులపై ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు అని తెలుస్తుంది. తారకరత్న మరణంతో బాధలో ఉన్న ఎన్టీఆర్ బయటికి రాకపోవచ్చు, అవార్డుల వేడుకలకి వెళ్లకపోవచ్చు, కానీ.. ఒక్క ట్వీట్ సోషల్ మీడియాలో ఆర్.ఆర్.ఆర్ గురించి వేయకపోవడం పలు అనుమానాలకి తావిస్తుంది. 

అంటే చరణ్ తో ఎన్టీఆర్ హాలీవుడ్ రేంజ్ లో హైలెట్ అవ్వాల్సింది పోయి.. కేవలం చరణ్ ఒక్కడే అక్కడ మీడియాలో హైలెట్ అవడం చూసిన ఎన్టీఆర్ లోపల బాధపడుతున్నాడేమో అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆందోళన మరింత ఎక్కువైంది.

Did NTR also take the light?:

Jr NTR Fans Are Worried Over The RRR Star Deliberately

Tags:   JR NTR, RRR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ