Advertisementt

ఇక్కడ కూడా అలీని తప్పించారుగా

Wed 01st Mar 2023 10:04 AM
ali,pawan kalyan  ఇక్కడ కూడా అలీని తప్పించారుగా
Ali on Why he was Not Offered a Role in Pawan Movies ఇక్కడ కూడా అలీని తప్పించారుగా
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సినిమాల్లో కమెడియన్ అలీకి కీలక పాత్ర ఉంటుంది అనేది ఒకప్పటి నిజం. వారిద్దరూ అంత మంచి ఫ్రెండ్స్ కూడా. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో అలీ ఆయనకి ఫ్రెండ్ గానో.. లేదంటే మరేదన్నా కీ రోల్ లో ఖచ్చితంగా కనిపించేవారు. కానీ పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాకా మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమాల నుండి అలీ పవన్ సినిమాల్లో కనిపించకుండా పోయారు. పవన్ సినిమాల్లో అలీ అస్సలు కనిపించడం లేదు. ఈ గ్యాప్ ఎందుకొచ్చిందో అందరికి తెలుసు., రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ vs అలీ అన్నట్టుగా ఉన్న సమయంలో అలీ ని పవన్ కళ్యాణ్ సినిమాల నుండి తప్పించారనే టాక్ ఉంది.

పవన్ కళ్యణ్ పై అలీ తరచు చేస్తున్న వ్యాఖ్యల ఫలితమే ఆయనకి పవన్ కళ్యాణ్ సినిమాల ఆఫర్స్ చేజారడానికి కారణమంటున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల్లో అలీ కనిపించలేదు. ఇప్పడు కొత్తగా మొదలైన PKSDP లోను అలీ లేరు. ఇక్కడ అలీ పేరుకి బదులుగా బ్రహ్మానందం పేరు కనిపిస్తుంది. అంటే అలీ ఉండాల్సిన చోట ఈసారి బ్రహ్మానందం ఉంటారేమో అనే అనుమానం అందరిలో కలుగుతుంది. ఏది ఏమైనా అలీని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోలేదు అంటే.. ఇకపై అలీకి పవన్ సినిమా ఛాన్స్ దక్కకపోవచ్చని అంటున్నారు.

కానీ అలీ మాత్రం మా ఫ్రెండ్ షిప్ అలానే ఉంది. ఆయన సినిమాల్లో నాకు ఇచ్చే పాత్ర దర్శకులు రాసుకోకపోవచ్చు. అంతమాత్రం దానికి నన్ను పవన్ సినిమాల నుండి తప్పించారనేది అవాస్తవం. మా మధ్యన బాండింగ్ అలానే ఉంది. అసలు మా మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయని సృష్టించేది మీరే అంటూ మీడియా పై ఫైర్ అయ్యారు.

Ali on Why he was Not Offered a Role in Pawan Movies:

Ali hopes he will get a chance in Pawan films

Tags:   ALI, PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ