ఆర్.ఆర్.ఆర్ ఎక్కడ చూసినా ఇదేమాట.. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఏ నోటా చూసినా ఇదే పలుకు. ఎక్కడ ఏ అవార్డు ప్రకటించినా అక్కడ ఆర్.ఆర్.ఆర్ ఉండాల్సిందే అన్నట్టుగా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని ఎల్లలు దాటించారు. అవార్డుల రారాజు ఆస్కార్ బరిలో ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ నిలవడం ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణం. ఆర్.ఆర్.ఆర్ అనేక విభాగాల్లో ఆస్కార్ కి నామినేట్ అవుతుంది అనుకున్నా.. చివరికి ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. ఇప్పటికే ఈ పాట పలు అవార్డులని దక్కించుకుంది.
ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ టీమ్ రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, కార్తికేయ, సెంథిల్ లు అమెరికాలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసిషియన్ అవార్డులు హడావిడిలో ఉండగా.. మార్చి 12 న జరగబోయే ఆస్కార్ అవార్డ్స్ కోసం వారు అక్కడే ఉండిపోయారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పర్సనల్ రీజన్స్ వలన ఈ వేడుకకి హాజరు కాలేకపోయారు. అయితే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కి మరో అద్భుత అవకాశం దక్కింది. అది ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ లైవ్ పెరఫార్మెన్స్. 95వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కి ఈ నాటు నాటు సాంగ్ తో లైవ్ పెరఫార్మెన్స్ కి అవకాశం దక్కింది.
ఈ విషయాన్ని అకాడమీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సినీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్కార్ అవార్డుల వేదికపై తెలుగు సింగర్లు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి అని తెలుస్తుంది. మరి నిజంగా ప్రతి భారతీయుడు, ముఖ్యంగా తెలుగు వారు గర్వం ఫీలవ్వాల్సిన సమయమిది. నిజంగా ఇదంతా రాజమౌళి చలవే.