సిద్దార్థ్-అదితి రావు ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నా తమ ప్రేమని బహింరంగపరచకుండా ఇంకా ఇంకా సీక్రెట్ ని మెయింటింగ్ చేస్తూనే లంచ్ డేట్స్, డిన్నర్ డేట్స్ అంటూ ముంబైలో మీడియాకి తరుచూ దొరికిపోతూనే ఉంటున్నారు. సిద్దార్థ్ ఎక్కడ ఉంటే అదితి అక్కడ వాలిపోతుంది. మా మధ్యన ఏం లేదంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట ఇప్పుడు ఇన్స్టా రీల్స్ లో ఇరగదీసింది. ఇన్స్టా లో సిద్దార్థ్-అదితి వేసిన డాన్స్ స్టెప్స్ కి అభిమానులు ముచ్చటపడిపోతున్నారు.
విశాల్ ఎనిమి సినిమాలో సూపర్ హిట్ అయిన ఓ సాంగ్ కి అద్దితి-సిద్దార్థ్ లు లయ బద్దంగా, చాలా క్యూట్ గా డాన్స్ చేసి ఆ వీడియో ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. Dance monkeys - The Reel deal అంటూ క్యాప్షన్ పెట్టారు. నిజంగా ఆ సాంగ్ లో హీరోయిన్ మ్రిణాళిని రవి-విశాల్ ఎంతబాగా డాన్స్ వేసి ఆకట్టుకున్నారో.. అంతకన్నా అందంగా, స్వీట్ గా సిద్దార్థ్-అదితిల జోడి డాన్స్ తో అద్భుతంగా అదరగొట్టేసారు. ఇంత క్లోజ్ గా డాన్స్ చేస్తున్న వీరు ప్రేమలో ఉన్నారని అందరూ అంటుంటే.. ఆ నిజమేదో చెప్పొచ్చుగా.. దాపరికలెందుకు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.