పుష్ప ద రూల్ షూటింగ్ మొదలైపోయింది.. జనవరి చివరి వారం నుండి ఓ 20 రోజుల పాటు ఏకధాటిగా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కొత్త షెడ్యూల్ కంప్లీట్ చేసిన సుకుమార్-అల్లు అర్జున్ లు తదుపరి షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. ఈమధ్యనే అల్లు ఫ్యామిలీ దుబాయ్ వెకేషన్స్ కి వెళ్ళొచ్చింది. అల్లు అరవింద్ ఆయన భార్య, ముగ్గురు కొడుకులు వాళ్ళ వాళ్ళ ఫామిలీస్ తో కలిసి దుబాయ్ లో గడిపిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పుష్ప పార్ట్ 1 తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా పుష్ప ద రూల్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతున్నాడో అనే ఆత్రుత అల్లు ఫాన్స్ లో అంతకంతకు ఎక్కువైపోతోంది.
ఇక పుష్ప ద రూల్ షూటింగ్ మొదలయ్యింది.. పుష్ప ద రూల్ ఫస్ట్ లుక్ పై అప్పుడే అల్లు అర్జున్ ఫాన్స్ ఆశపడిపోతున్నారు. అల్లు అర్జున్ బర్త్ డేకయినా పుష్ప నుండి ఏదో ఒక పోస్టర్ రాకపోతుందా అని వారు ఎదురు చూస్తుంటే.. పుష్ప ద రూల్ నుండి అల్లు అర్జున్ బర్త్ డే కి అంటే ఏప్రిల్ 8న స్పెషల్ గా పుష్ప గ్లిమ్ప్స్ విడుదల చెయ్యాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారంటూ అల్లు ఫాన్స్ ఊహించుకుంటున్నారు. త్వరలోనే మొదలు కాబోయే షెడ్యూల్ నుండి అల్లు అర్జున్ పై స్పెషల్ గ్లిమ్ప్స్ రెడీ చేస్తారని అంటున్నారు.
అయితే అల్లు అర్జున్ ఫాన్స్ కాస్త వైలెంట్ గాను స్పందిస్తున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ బర్త్ డై కి ఏదైనా అప్ డేట్ ఇవ్వకపోతే.. మైత్రి మూవీస్ కి మూడింది అంటూ సోషల్ మీడియాలో మేకర్స్ ని బెదిరిస్తూ ట్వీట్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు..