ప్రభాస్-మారుతి కలయికలో తెరకెక్కుతున్న చిత్ర అప్ డేట్స్ అధికారికంగా ఇవ్వకపోయినా.. ఆ మూవీకి సంబందించిన లీక్స్ అధికారికంగానే మేకర్స్ లీక్ చేసుకుంటున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కారణం ప్రభాస్ ఫాన్స్ ట్రోల్స్ తట్టుకోలేక మారుతినే కావాలని ఆ చిత్ర విషయాలను లీక్ చేయిస్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఫాన్స్ కి మారుతీతో ప్రభాస్ సినిమా చెయ్యడం అస్సలు ఇష్టం లేదు. అందుకే గుట్టు చప్పుడు కాకుండా సినిమాని మొదలు పెట్టి షూటింగ్ చేస్తున్నారు. అప్ డేట్స్ ఇస్తే ప్రభాస్ ఫాన్స్ చేతిలో బుక్ అవుతామేమో అని భయపడి ఇలాంటి లీకులు వదులుతున్నట్టుగా కనిపిస్తుంది వ్యవహారం.
మొన్నామధ్యన ప్రభాస్ కాస్ట్లీ కారు లంబోర్గాని ని నడుపుతూ మారుతి ఓ వీడియో లీక్ చెయ్యడంతో దానిని ఫాన్స్ వైరల్ చేసారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చెయ్యకపోయినా.. రాజా డీలక్స్ టైటిల్ గా పిలుస్తున్న ఈ మూవీ సెట్ నుండి గతంలో ప్రభాస్త మాస్ అవతార్ లో ఉన్న పిక్ లీక్ చేసారు. ఇక తాజాగా ఆ చిత్రం కోసం వేసిన ఓ ఇంటి సెట్ ముందు మారుతి కూర్చున్న పిక్ లీక్ చెయ్యగా దానిని ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రాజా డీలక్స్ థియేటర్ సెట్ లేదా.. అది ఇంటి సెట్టా అనేది క్లారిటీ లేకపోయినా.. ప్రభాస్-మారుతీ ఫిల్మ్ సెట్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు.
మరి మారుతి ప్లాన్ పర్ఫెక్ట్ గానే వర్కౌట్ అవుతుంది. అది ప్రస్తుతం సాంఘీక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇలాంటి లీకులతోనే ప్రభాస్ ఫాన్స్ మైండ్ సెట్ చేసి.. సినిమాపై ఎలాంటి నెగిటివిటి లేకుండా చూసుకుంటున్నాడు.