Advertisementt

ఎన్టీఆర్ అందుకే రాలేదంటున్న HCA

Tue 28th Feb 2023 03:01 PM
hollywood,ntr  ఎన్టీఆర్ అందుకే రాలేదంటున్న HCA
Hollywood Critics Association clarifies: We invited Jr NTR ఎన్టీఆర్ అందుకే రాలేదంటున్న HCA
Advertisement
Ads by CJ

అమెరికాలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసిషియన్ అవార్డ్స్ లో ఆర్.ఆర్.ఆర్ టీమ్ సందడి సోషల్ మీడియాని ఊపేస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ స్పెషల్ అప్పీరియన్స్ ని హాలీవుడ్ మీడియా కూడా తెగ హైలెట్ చేస్తుంది. దానితో మెగా ఫాన్స్ ఇక్కడ పూనకాలతో ఊగిపోతుంటే.. మెగాస్టార్ తన కొడుకు ఎదుగుదలకి పొంగిపోతున్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ అయితే అన్న కొడుకు చరణ్ ని ప్రశంశిస్తూ చేసిన ట్వీట్ కి ఎన్టీఆర్ ఫాన్స్ హర్టయ్యిపోయారు. చిరు-పవన్ ల పనే కాదు.. హాలీవుడ్ మీడియాలోనూ రామ్ చరణ్ ఊసే తప్ప ఎన్టీఆర్ మాట వినిపించకపోవడం పట్ల ఎన్టీఆర్ ఫాన్స్ ఆగ్రహంతో ఊగిపోతూ, ఎన్టీఆర్ ని పిలవలేదు అంటూ HCA ని టాగ్ చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చకి హాలివుడ్ క్రిటిక్స్ అసోసియేషియాన్ స్పందించింది.

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషియాన్ ప్రకటించిన బెస్ట్ మూవీ అవార్డ్స్ ఆర్.ఆర్.ఆర్ కైవసం చేసుకోవడంతో ఆ అవార్డు అందుకోవడానికి దర్శకుడు రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, సెంథిల్, కార్తికేయలు హాజరైన విషయం తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ ఫుల్ ఫిల్ అవడానికి మరో కారణం ఎన్టీఆర్. ఆ సెలెబ్రేషన్స్ లో ఎన్టీఆర్ లేకపోవడం ఫాన్స్ ఆందోళనకి కారణమైంది. అయితే ఈ విషయమై స్పందించిన HCA వారు.. తాము ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ పంపాము. 

అయితే ఎన్టీఆర్ ఓ సినిమా షూటింగ్ చేస్తున్నారు. తన సోదరుడు తారకరత్న చనిపోవడంతో.. సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక ఆయన వ్యక్తిగత కారణాల వలనే ఎన్టీఆర్ ఈ అవార్డు వేడుకలకి హాజరవలేదంటూ HCA చెప్పడంతో ఎన్టీఆర్ ఫాన్స్ కూలవుతున్నారు.

Hollywood Critics Association clarifies: We invited Jr NTR:

Hollywood Critics Association clarifies says that is why NTR did not come

Tags:   HOLLYWOOD, NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ