Advertisementt

షూటింగ్ లో సమంతకి గాయాలు

Tue 28th Feb 2023 01:41 PM
samantha  షూటింగ్ లో సమంతకి గాయాలు
Samantha gets bruised while shooting షూటింగ్ లో సమంతకి గాయాలు
Advertisement
Ads by CJ

ఆరునెలల పాటు కండరాల వ్యాధి, నీరసం(మాయోసైటిస్) తో బాధపడి ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుండి కోలుకుంటూ షూటింగ్స్ కి హాజరవుతుంది సమంత. తెలుగులో విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా, అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సీరీస్ షూటింగ్ లో సమంత పాల్గొంటుంది. సమంత అనారోగ్యం నుండి కోలుకుని మళ్ళీ మాములు స్థితికి రావడం ఆమె అభిమానులని సంతోషపెడుతున్న సమయంలో సమంత షూటింగ్ స్పాట్ లో గాయాలపాలైనది అంటూ వార్తలు రావడం ఆమె అభిమానులని కలవరపెడుతుంది. 

రాజ్ అండ్ DK డైరెక్షన్ లో సమంత సిటాడెల్ వెబ్ సీరీస్ చేస్తుంది. ఈ షూటింగ్ స్పాట్ లో యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటున్న సమయంలో ఆమె చేతులకి దెబ్బలు తగిలిన విషయాన్ని ఆమె తన ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా, టాలీవుడ్ మీడియా ప్రచురించడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో పాన్ ఇండియా వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ కోసం యాక్షన్ సీన్స్ రిహార్సల్స్ చేసి.. వెబ్ సీరీస్ లో ఫైట్స్ ఇరగదీసిన సమంతని అందరూ మెచ్చుకున్నారు. సిటాడెల్ వెబ్ సీరీస్ కోసం ఆమె హార్స్ రైడింగ్, ఇంకా కొన్ని యుద్ధ విన్యాసాల్లో శిక్షణ తీసుకుంది.

అయితే ఇప్పుడు ఆ వెబ్ సీరీస్ స్పాట్ లో చేతులకి దెబ్బలు తగలడంతో.. సమంత తన చేతులకైన గాయాలని చూపెడుతున్న పిక్ ని తన ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. సామ్ చేతులకు బాగా గాయాలైనట్లు ఉండటం చూసిన ఆమె అభిమానులు కలవరపడుతూ.. సమంత ఇంత రిస్క్ ఎందుకు.. కూల్ గా పని చేసుకోమంటూ సలహాలిస్తున్నారు.

Samantha gets bruised while shooting:

Samantha gets bruised while shooting her action sequences

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ