మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ కెరీర్ లోనే అతి పెద్ద డిసాస్టర్ గా నిలిచిన ఆచార్య సినిమాని దర్శకుడు కొరటాల ధర్మస్థలి అనే భారీ టెంపుల్ సెట్ లో జరిగింది. రామ్ చరణ్ అలాగే చిరంజీవి ఇద్దరూ ఈ సెట్ లోనే ఎక్కువ శాతం ఆచార్య షూటింగ్ చేసారు. అందుకే కొరటాల భారీ ఖర్చుతో టెంపుల్ సెట్ ని హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మించారు. సినిమాక రిలీజ్ అయ్యింది. డిసాస్టర్ అయ్యింది.. కానీ ఆ సెట్ ని అలానే ఉంచేశారు మేకర్స్.
అయితే టెంపుల్ సెట్ లో నిన్న సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఆచార్య ధర్మస్థలి టెంపుల్ సెట్ మొత్తం మంటల్లో కాలిపోతున్నట్లుగా చూపుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆచార్య సెట్ కి మంటలెలా అంటుకున్నాయి అనేది ఆ వీడియో బ్యాగ్రౌండ్ లో వినిపిస్తున్నాయి. ఆ సెట్ అగ్నిప్రమాదానికి గురవడానికి కారణం.. ఆ టెంపుల్ సెట్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద కూర్చొని ఎవరో సిగరెట్ కాల్చారని, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సెట్‌లో మంటలు చెలరేగాయంటూ ఆ వీడియో తీసిన వారు మాట్లాడుకోవడం అందులో వినిపించింది.
అంటే జస్ట్ ఓ సిగరెట్ 20 కోట్ల సెట్ ని అగ్నికి ఆహుతి చేసింది. 20 ఎకరాల్లో 20 కోట్లతో నిర్మించిన ఈ సెట్ ని సురేష్ సెల్వరాజన్ నిర్మించారు. మరి ఆ సెట్ కాలడానికి 20 నిముషాలు కూడా పట్టలేదనే కామెంట్స్ నెటిజెన్స్ నుండి వినిపిస్తున్నాయి.