ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఫ్యామిలీ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకుని.. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమై.. అమెరికాలోనే కాపురం పెట్టిన హీరోయిన్ లయ ఇన్నాళ్ళకి మళ్ళీ కనిపించింది. కొద్దిరోజులుగా తన కూతురు, అలాగే ఫ్రెండ్స్ రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో హడావిడి చేస్తున్న లయ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తుంది. పెళ్లి తర్వాత తన భర్త నటనకు దూరమవ్వమని తనకి ఎలాంటి కండిషన్ పెట్టలేదు, కానీ పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోవడంతో.. సినిమాలకి, ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చింది అని చెప్పిన లయ పవన్ కళ్యాణ్ సింప్లిసిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
లయకి 2006లో పెళ్లి కుదిరినప్పుడు మెగాస్టార్ చిరు ఇంటికి వెళ్లి ఆయనకి పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించాలనుకుందట. పెద్ద స్టార్ అయినా తన ప్రోగ్రామ్స్ కి చిరు అప్పుడప్పుడు వెళ్లడంతో ఆయన పెళ్ళికి పెళ్ళికి వచ్చే అవకాశం ఉంది అని ఆమె చిరు ఇంటికి వెళ్లగా.. లయ వచ్చింది అని తెలిసిన పవన్ కళ్యాణ్ లోపలి పిలిచి మట్లాడడమే కాదు.. ఆమె పెళ్లి పత్రిక అందుకుని, ఆయన కూడా పెళ్ళికి తప్పకుండా వస్తానని అన్నారట. అయితే చిరు పెళ్ళికి వస్తారేమో కానీ.. పవన్ కి నేనెవరో పెద్దగా తెలియకపోవచ్చు.. అందుకే పెళ్లికి వస్తారని అనుకోలేదు.
కానీ నా పెళ్లి జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ అందరికంటే ముందే వచ్చారు. అసలాయన పెళ్ళికి వస్తున్నట్టుగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సర్ ప్రైజింగ్ గా.. పెళ్లికి చాలా సింపుల్‌గా, ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సడెన్‌గా వచ్చేశారు. అదే సమయంలో నాతో మాట్లాడుతూ అన్నయ్య కూడా ఆన్ ది వే అంటూ చెప్పడం చూసి నేను చాలా ఆనందపడిపోయానంటూ లయ పెళ్ళినాటి ముచ్చట్లని బయటపెట్టింది.