Advertisementt

మంచు వారింట్లో సైలెంట్ సంబరాలు

Tue 28th Feb 2023 09:29 AM
manchu manoj  మంచు వారింట్లో సైలెంట్ సంబరాలు
Silent celebrations among the Manchu family మంచు వారింట్లో సైలెంట్ సంబరాలు
Advertisement
Ads by CJ

మంచు వారింట్లో సైలెంట్ సెలెబ్రేషన్స్ మొదలయ్యాయా.. అంటే అవుననే సమాధానం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మంచు మనోజ్ రెండో పెళ్లి సంబరాలు మంచు వారింట్లో మొదలైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సెలెబ్రేషన్స్ అన్ని కాస్త సీక్రెట్ గానే మొదలైనట్లుగా సమాచారం. మంచు మనోజ్ మొదటి పెళ్లికి సంబందించిన సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. పసుపు ఫంక్షన్, పెళ్లి కొడుకు ఫంక్షన్ అంటూ హడావిడి చేసారు మంచు ఫ్యామిలీ మెంబెర్స్. కానీ ఇప్పుడు ఏ సెలెబ్రేషన్స్ చేసినా కాస్త సైలెంట్ గానే చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

మార్చ్ 3న మనోజ్ భూమా మౌనిక రెడ్డి ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే మనోజ్ రెండో పెళ్లి తేదీని మంచు ఫ్యామిలీ కానీ, భూమా ఫ్యామిలీ కానీ.. ప్రకటన ఇవ్వలేదు. సోషల్ మీడియాలో మనోజ్ పెళ్లి మార్చ్ 3 అంటూ గట్టిగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా మంచు వారింట్లో.. మనోజ్ పెళ్లి సంబరాలు మొదలయ్యానే మాట వినిపిస్తుంది. మరి మంచు మనోజ్ పెళ్లి విషయంలో మంచు ఫ్యామి నుండి ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందేమో.. అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Silent celebrations among the Manchu family:

Manchu Manoj wedding celebrations started

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ