Advertisementt

విన్ అయ్యి ఏడాదయ్యింది.. ఇలా బిజీ అయ్యింది

Mon 27th Feb 2023 07:46 PM
bindu madhavi,bigg boss  విన్ అయ్యి ఏడాదయ్యింది.. ఇలా బిజీ అయ్యింది
Bindu Madhavi busy with web series విన్ అయ్యి ఏడాదయ్యింది.. ఇలా బిజీ అయ్యింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో గెలిచేసి.. బిగ్ బాస్ ట్రోఫీ తో విజేతగా.. సినిమాల్లో బిజీ అవుదామని కలలు కన్నవారికి బిగ్ బాస్ ప్రతి ఏడు షాకిస్తూనే ఉంటుంది. కాలం కలిసొచ్చి ఓటిటీలలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎలాగోలా కాస్త బిజీగా కనిపిస్తున్నారు కానీ.. సినిమాల అవకాశాల కోసం వెయిట్ చేస్తే మాత్రం కెరీర్ క్లోజ్ అన్నట్టుగా ఉంది వ్యవహారం. సీజన్ 1 విన్నర్ దగ్గర నుండి సీజన్ 6 వరకు అదే పరిస్థితి. అయితే గత ఏడాది బిగ్ బాస్ ఓటిటి సీజన్ లోకి ఎంటర్ అయ్యి తనదైన శైలితో అందరి అభిమానం సంపాదించి చివరికి బిగ్ బాస్ ఓటిటి సీజన్ 1 విజేతగా బయట కాలుపెట్టిన మాజీ హీరోయిన్ బిందు మాధవి ఫేట్ మారిపోతుంది అనుకున్నారు.

బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక కూడా గ్లామర్ ఫోటో షూట్స్ తో అదరగొట్టేసింది బిందు మాధవికి సినిమా ఆఫర్స్ వచ్చేస్తాయని కలలు కనింది. కానీ బిందు మాధవికి ఎలాంటి అవకాశం రాకపోగా.. ఆమెకి ఓటిటి ఆఫర్స్ వచ్చిపడ్డాయి. బిందు మాధవి నటించిన రెండు వెబ్ సీరీస్ ప్రముఖ ఓటిటీల్లో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో యాంగర్ టైల్స్ లోను, అలాగే ఆహా ఓటిటి నుండి న్యూసెన్స్ వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యింది.

సినిమా అవకాశాలు లేకపోయినా.. ఇలా వెబ్ సీరీస్ లతో బిందు మాధవి బిజీ అయ్యింది. ఏదో ఒకటి కలిసొచ్చినట్టేగా..  ఇలా బిగ్ బాస్ ఓటిటి సీజన్ 1 పూర్తయిన ఏడాదికి బిందు మాధవి రెండు ఓటిటి వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సీజన్ 5 విన్నర్ సన్నీ కూడా సినిమాల అవకాశాలు కోసం వెయిట్ చెయ్యకుండా వెబ్ సీరీస్ ల్లోకి దూకేసాడు.

Bindu Madhavi busy with web series:

Bigg Boss Bindu Madhavi Web Series update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ