సమంత 13 ఏళ్ళ సినీ జర్నీని పూర్తి చేసుకుంది. ఈ 13 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులని కెరీర్ పరంగానే కాదు.. వ్యక్తిగత జీవితంలోను ఎదుర్కొంది. సినిమాల్లో ఆటుపోట్లు, నిజ జీవితంలో సంతోషాలు, కన్నీళ్లు మధ్యలో అనారోగ్యం అంటూ సమంత ఎంత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేసిందో ఈ 13 ఏళ్లలో అంతే బాధని అనుభవించింది. ఏ మాయ చేసావే తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత కి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సమంతకి సోషల్ మీడియా ద్వారా విషెస్ అందించారు.
అయితే తాజాగా సమంత తన 13 ఏళ్ళ కెరీర్ పై సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికగా స్పందించింది. నేను ఎంత ఎదిగినా, ఎంత దూరం ప్రయాణం చేసినా.. మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఎప్పటికి మరచిపోను. అందుకు ధన్యవాదాలు. గతంలో ఎన్నో విషయాలు బాధపెట్టాయి. ఇకపై అలాంటిది జరగదు. ఎందుకంటే కేవలం ప్రేమ, కృతజ్ఞతతోనే ముందుకు సాగుతున్నాను, ఎప్పటికి కొత్త విషయాలను తెలియజేసే ప్రతి రోజుకి కృతజ్ఞతలు.. అంటూ సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.