ఏమాయ చేసావో చిత్రంతో జంటగా నటించి తర్వాత కొన్నేళ్ళకి ప్రేమలో పడి.. పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకుని.. నాలుగేళ్లు ఎంతో ప్రేమగా కాపురం చేసి క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య-సమంత లు 2021 అక్టోబర్ లో విడిపోయి విడాకులు తీసుకుని అభిమానుల హృదయాలని బద్దలు కొట్టేసారు. అయితే అప్పటినుండి నాగ చైతన్య మాత్రం సమంత విషయంలో ఎలాంటి కామెంట్స్ చెయ్యకుండా కామ్ గా హుందాతనాన్ని చూపించాడు. కానీ సమంత మాత్రం నాగ చైతన్య పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా చాలా పోస్ట్ లు పెట్టడమే కాదు, ఆమె సోషల్ మీడియాలో చైతూ తో కలిసున్న ప్రతి ఒక్క ఫోటోని డిలేట్ చేసేసింది.
అయితే సమంత ఏ మాయ చేసావే తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నిన్నటికి 13 సంవత్సరాలు పూర్తవడంతో ఆమెకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో 13 ఏళ్ళ సమంత జర్నీని ప్రశంసిస్తూ పోస్ట్ లు వెలిసాయి. సమంత కూడా ఏ మాయ చేసావే లో తన సింగిల్ ఫోటోలని మాత్రమే షేర్ చేసింది. నాగ చైతన్య ఉన్న పోస్టర్ కాకుండా జెస్సి పోస్టర్స్ మాత్రమే షేర్ చేసింది. కానీ నాగ చైతన్య సమంతతో కలిసి ఉన్న ఏ మాయ చేసావే పోస్టర్ షేర్ చేస్తూ..13 ఏళ్లు అంటూ ట్యాగ్ చేశాడు.
మరి సమంత అలా, చైతు ఇలా ఏ మాయ చేసావే 13 ఏళ్ళ హిట్ ని గుర్తు తెచ్చుకున్నారు. కానీ సమంత చైతు పిక్ లేకుండా ఫోటోలని షేర్ చెయ్యడం ఓ వర్గం ఆడియన్స్ కి నచ్ఛలేదు, కానీ నాగ చైతన్య సమంత తో విడిపోయినా.. సమంత ఫోటోని కలిపి షేర్ చెయ్యడంతో అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాడు.