Advertisementt

వారిద్దరితో మాయమై, బాలయ్య తో రీ ఎంట్రీ

Mon 27th Feb 2023 10:04 AM
kajal aggarwal,balayya nbk 108  వారిద్దరితో మాయమై, బాలయ్య తో రీ ఎంట్రీ
Disappeared with both of them and re-entered with Balayya వారిద్దరితో మాయమై, బాలయ్య తో రీ ఎంట్రీ
Advertisement
Ads by CJ

చిరంజీవి ఆచార్య సినిమాలో హీరోయిన్ గా షూటింగ్ చేసిన కాజల్ అగర్వాల్ కి టీమ్ షాకిచ్చింది. అసలు కాజల్ అగర్వాల్ ఎపిసోడ్ ఆచార్య లో లేకుండా లేపేశారు. కాజల్ ఆచార్య తర్వాత నాగార్జున ద ఘోస్ట్ సినిమాలో కాజల్ రా ఏజెంట్ గా కనిపించడానికి రెడీ అయ్యింది. ఘోస్ట్ కి కూడా కొద్దిరోజులు షూటింగ్ కూడా చేసాక.. ప్రెగ్నెన్సీ రావడంతో ఆ సినిమా నుండి తప్పుకుంది. ఆ తర్వాత ఒక ఏడాది గ్యాప్ తీసుకుని ముందు ఒప్పుకున్న ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేస్తుంది.

అయితే చిరు, నాగార్జున సినిమాలతో మాయమైన కాజల్ అగర్వాల్ ఇప్పుడు బాలకృష్ణ తో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అనిల్ రావిపూడి-బాలకృష్ణ కలయికలో తెరకెక్కబోతున్న NBK108 చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా వార్తలు రావడంతో ఆమె అభిమానులు చిరంజీవి, నాగార్జున సినిమాల తర్వాత మళ్ళీ సీనియర్ హీరో బాలయ్య తోనే రీ ఎంట్రీ ఇస్తుంది అంటున్నారు. అయితే బాలయ్య తో కాజల్ నటించడానికి భారీగా డిమాండ్ చేస్తుంది అనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Disappeared with both of them and re-entered with Balayya:

Kajal Aggarwal: Huge Demand For Balayya NBK 108

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ