బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరస సినిమాలు, అలాగే పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేతినిండా సంపాదనతో అందరికన్నా టాప్ లోనే కనిపిస్తున్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన సెల్ఫీ గత శుక్రవారం విడుదలవగా.. సినిమాకి నెగెటివ్ టాక్ రావడం బాలీవుడ్ ఆడియన్స్ ని, అక్షయ్ కుమార్ ని కూడా డిస్పాయింట్ చేసింది. అయితే సినిమాలు ప్లాప్ అవడానికి కారణం తానే అని, ప్రేక్షకులని నిందించవద్దు అంటూ అక్షయ్ కుమార్ సెల్ఫీ ప్రమోషన్స్ లో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ వందల కోట్లు పారితోషకం అందుకుంటున్న అక్షయ్ కుమార్ గత ఏడాది ఐదారు సినిమాలని రిలీజ్ చేస్తే ఒక్క సినిమా కూడా నిర్మాతని సంతోషపెట్టలేదు.
గత కొద్దిరోజులుగా సక్సెస్ కి దరి చేరని అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. సినిమాల విషయంలో ఎన్నో ఒడిదుకులని ఎదుర్కొన్నాను, ఒకొనొక సమయంలో నేను నటించిన 16 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇంకోసారి వరసగా ఎనిమిది పరాయజలు పలకరించారు. సినిమా హిట్ అవడం లేదంటే దానిలో నా లోపమే ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పులొచ్చాయి. వాళ్ళ ఆలోచన మారింది. కొత్తదనం కోరుకుంటున్నారు.
నేను ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చెయ్యాలని, వాళ్ళకి నచ్చే సబ్జెక్టు ని ఎంచుకోవాలని చూస్తున్నాను, సినిమా హిట్ అవ్వకపోతే ప్రేక్షకులని నిందించకూడదు.. అది వంద శాతం నా తప్పే అంటూ అక్షయ్ కుమార్ సెల్ఫీ ప్రమోషన్స్ లో చెప్పడం హైలెట్ అయ్యింది.