Advertisementt

కథలు కుదరక కదల్లేక ఉన్న చిరంజీవి

Sun 26th Feb 2023 12:31 PM
chiranjeevi,bhola shankar  కథలు కుదరక కదల్లేక ఉన్న చిరంజీవి
Chiranjeevi who can't move stories కథలు కుదరక కదల్లేక ఉన్న చిరంజీవి
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ అందుకుని అదే ఊపులో భోళా శంకర్ షూటింగ్ ని చకచకా కానిచ్చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ లుక్స్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. అయితే భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి చిత్రం చేస్తారు, ఏ దర్శకుడితో కమిట్ అవుతున్నారో మెగా ఫాన్స్ కి క్లారిటీ లేదు. మెగా ఫాన్స్ కేనా.. అసలు మెగాస్టార్ కే క్లారిటీ లేదు.

చిరంజీవి గారితో సినిమాలు చెయ్యడానికి యంగ్ దర్శకులు రెడీగా ఉన్నా చిరు ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఆయనకు సరిపోయే కథలు దొరక్క, నచ్చిన దర్శకులు దొరక్క స్ట్రగుల్ అవుతున్న మెగాస్టార్ తో సినిమాలు చెయ్యడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు దానయ్య ఎంటెర్టైనమెంట్, కె ఎస్ రామారావు, కొణిదెల ప్రొడక్షన్, మైత్రి మూవీస్ మేకర్స్ లాంటివి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి కథ చెప్పి ఒప్పించే పనిలో వెంకీ కుడుములు, కళ్యాణ్ కృష్ణ, పూరి జగన్నాథ్, వి.వి వినాయక్, హరీష్ శంకర్ లాంటి దర్శకులు రెడీగా ఉన్నారు. 

ఇలా దర్శకులు, రచయితలు చెప్పే కథలని వింటున్న చిరంజీవి.. ఆయనకి కథ నచ్చితే దర్శకుడిని లైన్ లో పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు.  

Chiranjeevi who can't move stories:

Confusion on Chiranjeevi Next After Bhola Shankar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ