యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కారణం.. ఓ వైపు ఆర్.ఆర్.ఆర్ టీం మొత్తం అమెరికాలో ఉంది. అక్కడ అవార్డుల హడవిలో ఉండగా.. తారకరత్న మరణంతో ఎన్టీఆర్ అమెరికా వెళ్లలేకపోయాడు. ఇటు రాజకీయంగా లోకేష్ ఎన్టీఆర్ ని టిడిపిలోకి పిలవడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. లోకేష్ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలోకి వస్తాడు అని చెప్పగానే.. ఎనిమీస్ భుజాలు తడుమంటున్నారు. ఎన్టీఆర్ ఎక్కడ టిడిపిలోకి వచ్చేసి చంద్రబాబుని గెలిపించి వేస్తాడో అంటూ డిబేట్ లు పెట్టి మరీ ఎన్టీఆర్ విషయంలో కంగారు పడిపోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎవరు.. అసలు టీడీపీ సీనియర్ ఎన్టీఆర్ ది. దానికి వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు తప్ప.. నారా వారి కోసం నందమూరి ఫ్యామిలీ పల్లకి మొయ్యలా అంటూ గోల చేస్తున్నారు.
అసలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాలు పక్కనబెట్టి పూర్తిగా కెరీర్ మీద ఫోకస్ చేసి.. పాన్ ఇండియా స్టార్ గా ఎలాంటి సినిమాలు చెయ్యాలో ఆలోచిస్తూ కామ్ గా తన పని తాను చేసుకుపోతుంటే.. ఇటు వైసిపీ నేతలు ఎన్టీఆర్ ఎక్కడ టిడిపిలోకి వచ్చేస్తాడో అని కంగారు పడడం అందరికి నవ్వు తెప్పిస్తుంది. కొడాలి నాని, వంశీ వల్లభనేని వంటి వారు ముందే ఛానల్స్ లో కూర్చుని ఎన్టీఆర్ ని లోకేష్ ఆహ్వానించడమేమిటి.. ఎన్టీఆర్ దే టిడిపి అంటున్నారు. ఎప్పుడో మామ చంద్రబబు పిలిచారు, బాల బాబాయ్ అడిగారు అంటూ తారక్ ప్రచారంలోకి దిగి.. అనవసరంగా విమర్శలపాలయ్యాడు. అప్పటినుండి రాజకీయాలకి రామ్ రామ్ చెప్పి కెరీర్ ని పట్టుకుని ఇప్పుడు నేషనల్ స్టార్ గా ఎదిగాడు.
ఎన్టీఆర్ ఇప్పుడు, ఇకపై చెయ్యబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా లేవల్లోనే ఉండబోతున్నాయి. కొరటాల ప్రాజెక్ట్ అలాగే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, అటు తమిళ డైరెక్టర్ వెట్రి మారన్ ప్రాజెక్ట్ లు చూస్తుంటే.. ఎన్టీఆర్ ఇప్పుడప్పుడే రాజకీయాలవైపు వెళ్లే ఉద్దేశ్యం లేనట్లుగా సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. అది అర్ధ కానీ వారు ఆయనపై పొలిటికల్ డైలాగ్స్ పేలుస్తున్నారు.