నయనతార పెళ్లి తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది.. ఆమె భర్త విగ్నేష్ శివన్ అమ్మ గారు చెప్పడంతోనే నయనతార ఇలాంటి డెసిషన్ తీసుకుంది, అదే విగ్నేష్ శివన్ తల్లి కండిషన్ అంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి. కానీ నయనతార పెళ్లి తర్వాత సినిమాలు చేస్తూనే ఉంది. షారుఖ్ తో నయన్ జవాన్ లో నటిస్తుంది. ఆ షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుంది. అయితే నయనతార జవాన్ తర్వాత సినిమాలకి బ్రేక్ తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కారణం నయనతార సినిమాలకి బై బై చెప్పకపోయినా.. గ్యాప్ అయితే ఖచ్చితంగా తీసుకోబోతుంది అంటున్నారు. ఎందుకంటే తన పిల్లల సంరక్షణ చూసుకోవాలి, వాళ్ళ ఆలనాపాలనా చూసుకోవాలని నిర్ణయం తీసుకుని సినిమాలకి బ్రేక్ ఇవ్వాలని నయనతార ఆలోచన చేస్తుందట. గత ఏడాది నయనతార-విగ్నేష్ శివన్ లు సరోగసి ద్వారా కవలపిల్లలని తమ చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన పిల్లల కోసమే నయనతార ఆ కఠిన నిర్ణయం తీసుకోబోతుంది అంటున్నారు.
అయితే నయనతార సినిమాలకు గ్యాప్ ఇస్తుంది అని తెలిసిన ఆమె అభిమానులు మాత్రం కంగారు పడిపోతున్నారు. క్రేజీ లేడీ సూపర్ నయనతార ఇంత పాపులారిటీ ఉన్న సమయంలో సినిమాలకి బ్రేక్ తీసుకోవడం కరెక్ట్ కాదు.. పిల్లల కోసం ఎవరినైనా పెట్టండి అంటూ నయనతారని వేడుకుంటున్నారు.