జబర్దస్త్ లోకి దూసుకొచ్చి తన పెరఫార్మెన్స్ తో నటనకు అందం ముఖ్యం కాదు.. టాలెంట్ ఉంటే సరిపోతుంది అని నిరూపించి తనదైన కామెడీతో బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో తనని తాను నిరూపించుకుని.. అదే క్రేజ్ తో స్టార్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్6 లోకి అడుగుపెట్టింది ఫైమా. బిగ్ బాస్ లో తనలోని కామెడీ యాంగిల్ మాత్రమే కాకుండా, కాస్త వెటకారం, అలాగే తన ఫిట్ నెస్ చూపిస్తూ.. డాన్స్ వేస్తూ తనలోని స్ట్రెంత్ ని బయట పెట్టి టాప్ 6 వరకు వెళ్లగలిగింది. ఆ తర్వాత నిత్యం సోషల్ మీడియాలోనే దర్శనమిస్తుంది.
ప్రస్తుతం స్టార్ మా BB జోడిలో RJ సూర్య తో కలిసి డాన్స్ స్టెప్స్ కుమ్మేస్తుంది. అయితే తాను పేదరికం నుండి వచ్చానని, ఉండడానికి ఇల్లు కూడా లేదు, తల్లితండ్రుల సపోర్ట్ తోనే ఇంత ఎత్తుకు ఎదిగాను అంటూ వాళ్ళ కోసం ఓ ఇల్లు కొని దానికి కావాల్సిన ఇంటీరియర్ చేయిస్తున్నట్టుగా ఫైమా చెప్పింది. తల్లితండ్రులకి ఇల్లు కొనివ్వాలనే కలను ఇప్పటికి సాకారం చేసుకున్నట్టుగా చెప్పిన ఫైమా ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తన కొత్తింటితో పాటుగా తన తల్లికి మరో గిఫ్ట్ ఇచ్చింది ఫైమా.
అంతేకాకుండా తన పక్క ఇళ్లలోని వారి కొడుకులు కార్లు కొని పేరెంట్స్ ని కార్లలో తీసుకుపోతుంటే.. మా ఇంట్లో కొడుకు లేకపోవడంతో మా పేరెంట్స్ మోహంలో బాధ చూసాను. అప్పట్లో ఆ బాధ తగ్గించేందుకు స్కూటీ కొని ఊరంతా తిప్పాను, అప్పుడే అనుకున్నాను ఏదో ఒకరోజు కారు కొనాలని, అందులో వాళ్ళని తిప్పాలి అని. అది ఇప్పుడు నిజం కాబోతుంది.. అంటూ ఓ వీడియో ని యూట్యూబ్ లో పోస్ట్ చేసింది ఫైమా.