పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాని మొదలు పెట్టేసారు. హరి హర వీరమల్లు షూటింగ్ అలాగే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్.. ఇంకా సుజిత్ OG సినిమాలతో పాటుగా సముద్ర ఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి తేజ్ తో తమిళ హిట్ వినోదియ సిత్తం రీమేక్ చేస్తున్నారు. ఈ వారంలోనే పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ రీమేక్ అప్పుడే పట్టాలెక్కేసింది. అంటే రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. సాయి తేజ్ తో పవన్ కళ్యాణ్ చెయ్యబోయే ఈ రీమేక్ పై ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలున్నాయి.
పవన్ కళ్యాణ్ గాడ్ గా కనిపించనున్న ఈ చిత్రం లొకేషన్ నుండి కొన్ని ఫొటోస్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ రెడ్ షర్ట్ వేసుకుని జీప్ మీద కూర్చుని కనిపిస్తున్నారు. మేనల్లుడు, సముద్రఖనిలతో పవన్ ఏదో డిస్కర్స్ చేస్తున్నారు. సాయి తేజ్ కూడా ఫ్రేమ్ లో కనిపిస్తుండగా పక్కనే దర్శకుడు సముద్రఖని కూడా ఉన్నారు. ఇంకా ఈ చిత్ర బృందం, అలాగే అక్కడ చాలా హడావిడి కనబడుతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.