ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యి మార్చ్ 25 కి ఏడాది కావొస్తున్నా ఇంకా ఇంకా ఆర్.ఆర్.ఆర్ ముచ్చట మీడియాని వదలడం లేదు. ఆర్.ఆర్.ఆర్ హీరోలు ఇప్పటికి మీడియాలో సందడి చేస్తున్నారు. రాజమౌళి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిలు ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు.. ఎక్కడ సినిమా అవార్డుల ప్రకటన వచ్చినా అందులో ఆర్.ఆర్.ఆర్ ఉండాల్సిందే అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ప్రకటించగా అందులో కూడా ఆర్.ఆర్.ఆర్ తన క్రేజ్ ని తన సత్తాని చూపించింది.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్టెంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడమే కాదు.. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ లు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ అందుకుని ఫొటోలకి ఫోజులిచ్చారు. అంతేకాకుండా క్రిటిక్స్ ఛాయస్ సూపర్ అవార్డ్స్ యాక్షన్ మూవీ కేటగిరి నుండి బెస్ట్ యాక్టర్స్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ని బ్రదర్ అంటూ సంబోధిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది,.
హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లాంటి టాప్ యాక్టర్స్ తో పక్కన చరణ్, ఎన్టీఆర్ పేర్లని చూసి మెగా-ఎన్టీఆర్ ఫాన్స్ యమా ఎగ్జైట్ అవుతుంటే.. రామ్ చరణ్ మాత్రం క్రిటిక్స్ ఛాయస్ సూపర్ అవార్డ్స్ యాక్షన్ మూవీ కేటగిరిలో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లాంటి నటుల సరసన నేను, నా బ్రదర్ ఎన్టీఆర్ పేర్లు కలిసి ఉండడం ఎంతో హ్యాపీ ఉంది అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఆర్.ఆర్.ఆర్ కబుర్లే కనిపిస్తున్నాయి.