మంచు మనోజ్ రెండో పెళ్ళికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మొదటి భార్యని ప్రేమించి పెళ్లాడిన మనోజ్ ఆమెతో తో మనస్పర్థలు వచ్చి, ఆమెకి విడాకులు ఇచ్చి ఇప్పుడు మనోజ్ మరో అమ్మాయి ప్రేమలో పడ్డాడు. నంద్యాల పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న భూమా మౌనిక రెడ్డిని మనోజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. ఇప్పటికే మనోజ్-మౌనికలు కలిసి ఉంటున్నారని మీడియా కోడై కూస్తుంది. అయితే ఈ నెల మొదటి వారం అంటే ఫిబ్రవరి రెండు, మూడు తేదీల్లో మంచు మనోజ్- మౌనిక రెడ్డిల వివాహ తేదీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా.. ఆ విషయంలో మనోజ్ సైలెంట్ గానే ఉన్నాడు.
మనోజ్ సెకండ్ మ్యారేజ్ విషయంలో మంచు ఫ్యామిలీ కూడా సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తుంది.
మళ్ళీ ఇప్పుడు మనోజ్ పెళ్లి మార్చి 3న అంగరంగ వైభవంగా కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుంది అంటున్నారు. ఈ విషయమై ఎలాంటి ప్రకటన చెయ్యడానికి మంచు ఫ్యామిలీ కానీ, భూమా ఫ్యామిలీ కానీ సిద్ధం గా లేరని, మనోజ్-మౌనికల వివాహానంతరం కొత్త జంట మీడియా కి దర్శనమిస్తుంది అంటున్నారు. ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలైపోయాయనే టాక్ నడుస్తుంది.
మంచు మనోజ్ కే రెండో వివాహం కాదు, అటు మౌనిక రెడ్డికి కూడా రెండో పెళ్లే. ఆమె మొదటి భర్తకి విడాకులిచ్చి మనోజ్ తో రెండో పెళ్ళికి సిద్దమైన విషయం తెలిసిందే.