పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనూ, అలాగే రాజకీయాల్లోనూ యమా బిజీగా ఉంటున్నారు. ఇటు వరసగా ప్రాజెక్టులు మీద ప్రాజెక్టులు ఓపెన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అటు వారహితో రోడ్డుపైకి రావడానికి రెడీ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు, సినిమాలు ఇలా రెండిటిని మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం. కానీ ఆయనకి రెండు చోట్ల ఇద్దరు బలమైన వ్యక్తుల సపోర్ట్ ఉంది. వారే నాదెండ్ల మనోహర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు. అయితే రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ అప్పుడు త్రివిక్రమ్ రాసిచ్చిన ఉపన్యాసాలని చదివిన పవన్ కళ్యాణ్ వలన త్రివిక్రమ్ కి మెగా ఛాన్స్ లు రావు, ఇతర హీరోలు అవకాశాలు ఇవ్వరని ప్రచారం జరిగింది.
ఇక పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు సెకండ్ ప్లేస్ లోను, ఆయన అవైల్ బుల్ లేనప్పుడు ఫస్ట్ ప్లేస్ లోను జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ నడిపిస్తున్నారు.
అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు అటు త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ బాండింగ్ ని, ఇటు పాలిటిక్స్ లో నాదెండ్ల మనోహర్ తో ఉన్న బాండింగ్ ని ఫొటోస్ రూపంలో షేర్ చేస్తూ.. రాజకీయంగా మనోహర్ గారు, సినిమాల్లో త్రివిక్రమ్ గారు కళ్యాణ్ గారికి అండగా నిలవడం నిజంగా కళ్యాణ్ గారి బలం, అది అర్ధంచేసుకోకుండా వారిని దూషించడం అనేది కొంతమంది కార్యకర్తల, అభిమానుల అపరిపక్వతగా భావిస్తున్నాము. #NadendlaManohar #Trivikram #PawanKalyan #janasena అంటూ కొంతమంది పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
వాళ్ళు చెప్పిన దానిలో నిజముంది. ఇక్కడ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి మంచి కథలు ప్రిఫర్ చేస్తూ ఆయన్ని రీమేక్స్ వైపు నడిపిస్తున్నారు త్రివిక్రమ్. అది కూడా హిట్ సినిమాలకు త్రివిక్రమ్ సారథ్యంలో నడిచే రీమేక్స్. అలా ఆయన కెరీర్ లో త్రివిక్రమ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటు నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ జనసేన ముందుండి నడిపిస్తున్నారు. ఫాన్స్ చెప్పినదానిలో తప్పేమి లేదు. విమర్శించే వాళ్ళు మంచైనా, చెడునైనా ఒకేలా చూస్తారు.