నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన అన్న కొడుకు తారకరత్న కి జరగవలసిన దశదిన కర్మల కార్యక్రమాలు చూసుకుంటున్నారు. గత శనివారం మహాశివరాత్రి రోజున కన్నుమూసిన తారకరత్నకు మొన్న ఐదో రోజు చిన్న కర్మని నిర్వహించగా.. ఇంకా పెద్ద కర్మ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుని బాలకృష్ణ అనిల్ రావిపూడి తో చేస్తున్న NBK108 షూటింగ్ లో జాయిన్ అవుతారు. మార్చ్ 12 నుండి తదుపరి NBK108 షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఆయన తదుపరి ప్రాజెక్ట్ పై ఫాన్స్ లో చాలా క్యూరియాసిటీ కనిపిస్తుంది. NBK109 ని బింబిసార దర్శకుడు వసిష్ఠతో చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం వసిష్ఠ చెప్పిన కథ ఫైనల్ నరేషన్ లో ఉంది. ఇంకోవైపు పూరి జగన్నాథ్ మరొక కథ ప్రిపేర్ చేసి బాలయ్య డెసిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 10 బాలకృష్ణ బర్త్ డే కి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ని లాంచ్ చేసి కొడుకు మోక్షజ్ఞని హీరోగా అభిమానుల ముందుకు తీసుకురావాలనేది బాలకృష్ణ ఆలోచన. ఇక నాలుగోది.. సి కళ్యాణ్ నిర్మాతగా.. వివి వినాయక్ డైరెక్షన్ లో కథ సెట్ చేసి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా చేద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరి నాలుగు ప్రాజెక్ట్ మధ్యన ఉన్న నందమూరి బాలకృష్ణ ఏ డెసిషన్ తీసుకుని NBK109 ప్రాజెక్ట్ ఫైనల్ చేస్తారో అని నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.