ప్రస్తుతం సీనియర్ హీరోస్ చిరంజీవి-బాలకృష్ణలు వరస సినిమాలో యంగ్ హీరోలతో పోటీ పడడం కాదు.. యంగ్ హీరోలని వెనక్కి నెట్టేస్తున్నారు. మెగాస్టార్ చిరు ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. బాలకృష్ణ వరస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. 60 ప్లస్ లోను ఈ ఇద్దరు హీరోలు యంగ్ హీరోల మాదిరి సెట్స్ లో కష్టపడడమే కాదు.. చాలా ఎనర్జీ చూపిస్తున్నారు. తమ ఏజ్ కి సరిపోయే పాత్రలతో దుమ్మురేపుతున్నారు. గాడ్ ఫాదర్ లో చిరంజీవి మిడిల్ ఏజ్ లుక్ లో అదరగొట్టేస్తే.. బాలకృష్ణ వీరసింహారెడ్డి లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఇరగదీసారు.
ఇప్పుడు ఈ ఏజ్ లోను చిరు-బాలయ్యలు మేకప్ లతో కవర్ చేసినా.. మోహంలో వయసు పైబడిన ఛాయలు అంతగా కనిపించడం లేదు. అయితే చిరంజీవి-బాలకృష్ణ ఇద్దరూ మరో 15 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటారో వాళ్ళ అభిమానులు ఇమాజిన్ చేసుకుంటున్నారు. బాలకృష్ణ-చిరు మొహాలని ఫోటో షాప్ చేసి ఏజెడ్ లుక్ లో అంటే 80s లో ఇలా ఉంటారంటూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
చిరు-బాలకృష్ణ క్లోజప్ షాట్స్ ని మరో పదిహేనేళ్ల ముందుకు తీసుకువెళ్లి గ్రాఫిక్స్ చేసి ఆ లుక్స్ ని డిజైన్ చేసి మరీ.. Maybe in about fifteen years time.. 😂😂😂 ఇలా క్యాప్షన్ పెట్టి షేర్ చెయ్యగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.