అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డికి హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ ఉంది సోషల్ మీడియాలో. స్నేహ కి ఇన్స్టా లో హీరోయిన్స్ కి కుడా లేనంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అంత క్రేజ్ ఉన్న స్నేహ రెడ్డి అవుట్ ఫిట్స్ లోను హీరోయిన్స్ నే మించిపోయేలా తయారవుతుంది. అల్లు అర్జున్ తో పెళ్లి, ఇద్దరు పిల్లలు పుట్టాక కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే స్పెషల్ ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. ఆ ఫోటో షూట్స్ కూడా చాలా గ్లామర్ గా హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా అన్నమాట.
అయితే మొన్నొక ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ గారు తన కోడలు ఎంత పెద్ద స్టార్ హీరో వైఫ్ అయినా.. ఇంట్లో అన్నీ తానే చూసుకుంటుంది అంటూ పొగిడేశారు కూడా. తాజాగా స్నేహ రెడ్డి ఇన్స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. దానిలో తనకిష్టమైనది ఏమిటో చెప్పేసింది. తనకి మొక్కల పెంపకం అన్నా నర్సరీ అన్నా అంటే చాలా ఇష్టమని.. మన చుట్టూ మొక్కలు ఉంటే ఆ ఆనందమే వేరు. మొక్కలు చూడగానే ప్రేమలో పడిపోతాము, మొక్కల పెంపకం మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
అందుకే నాకు నర్సరీ అన్నా మొక్కలన్నా ఎంతో ఇష్టమంటూ ఆ వీడియోలో తన చేతిలో ఉన్నమొక్కలతో పోస్ట్ చేసింది. ఇక ఈ విడియోలోను స్నేహ రెడ్డి నార్మల్ జీన్స్ ప్యాంట్, టీ షార్ట్ వేసినా.. ఎంతో స్టైలిష్ గా కనిపించింది.