జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా తనదైన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులని నవ్విస్తున్న రాకింగ్ రాకేష్ ఫైనల్లీ పెళ్లి పీటలెక్కాడు. కొన్నాళ్లుగా బిగ్ బాస్ ఫేమ్ జోర్దార్ సుజాతతో ప్రేమలో ఉన్న రాకేష్.. గత నెలలో నిశ్చితార్ధం చేసుకున్నాడు. నిశ్చితార్ధాన్ని సింపుల్ గా చేసుకున్న రాకేష్-సుజాతలు.. ఎంగేజ్మెంట్ షాపింగ్, అలాగే ఫంక్షన్ హాల్ తదితర వివరాలు యూట్యూబ్ ఛానల్స్ లో చూపించారు. ఇప్పుడు పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేసుకున్నారు. నిన్న గురువారం రాకేష్-సుజాతల వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. తాను ప్రేమించిన సుజాతతో రాకింగ్ రాకేష్ ఏడడుగులు వేశాడు.
సుజాత-రాకేష్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు అలాగే జబర్దస్త్ కమెడియన్స్ వాళ్ల ఫ్యామిలీస్ తో హాజరైన ఈ పెళ్లి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. రాకేష్-సుజాతల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జబర్దస్త్ లో రాకేష్ స్కిట్స్ లోనే కమెడియన్ గా చేరిన సుజాత.. రాకేష్ లు ప్రేమలో పడి.. కొద్దిగా గ్యాప్ తీసుకుని ఇరు కుటుంబాల పెద్దలని ఒప్పించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
రీల్ జోడి కాస్త రియల్ జోడిగా మారడంతో నూతన వధూవరులకు నెటిజెన్స్, అలాగే జబర్దస్త్ అభిమానులు, రాకేష్, సుజాత ఫాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.