శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో ప్రత్యేకంగా వినిపిస్తున్న పేరు, యంగ్ హీరోలు జపం చేస్తున్న పేరు. శ్రీలీల శ్రీలీల ఇదే నామ జపం చేస్తుంది సినిమా ఇండస్ట్రీ. పెళ్లి సందడి, ధమాకా చిత్రాలతో చేతి నిండా అవకాశాలతో టాప్ హీరోయిన్స్ కి షాకిస్తున్న శ్రీలీల ఇప్పుడు మెగా ఛాన్స్ కొట్టేసింది అనే టాక్ వినిపిస్తుంది. మెగా ఛాన్స్ అంటే అలాంటి ఇలాంటి ఛాన్స్ కాదండోయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి తేజ్ కలయికలో రాబోతున్న తమిళ రీమేక్ ఛాన్స్ అంట. అంటే పవన్ ఆయన మేనల్లుడుతో కలిసి చేసే సినిమా అన్నమాట.
అయితే ఆ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే కేతిక శర్మ ఫిక్స్ అవ్వగా.. ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ పేరు కూడా వినిపిస్తుంది. లక్కీ బ్యూటీ శ్రీలీలని మాత్రం ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం తీసుకోబోతున్నారట. ధమాకాలో శ్రీలీల ఎనేర్జిటిక్ స్టెప్స్ చూసి ఇంప్రెస్స్ అయ్యి ఆమెని ఎంత త్వరగా తమ సినిమాల్లో ఎంపిక చేసుకోవాలి అని చాలామంది దర్శకనిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సముద్రఖని దర్శకత్వంలో త్రివిక్రమ్ స్క్రిప్ట్ ప్రకారం మామ-అల్లుళ్ళ మధ్యలో ఓ స్పెషల్ సాంగ్ క్రియేట్ చేసి ఆ సాంగ్ కోసం శ్రీలీలని దించే ప్లాన్ చేశారట. మహేష్-త్రివిక్రమ్ చిత్రంలో శ్రీలీల వన్ అఫ్ ద హీరోయిన్.
సో త్రివిక్రమ్ అడగడం ఒక కారణమైతే.. పవన్ కళ్యాణ్ ఉండడం మరో కారణం, అందుకే శ్రీలీల కూడా ఈ స్పెషల్ సాంగ్ చెయ్యడానికి ఒప్పేసుకుంది అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.