మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో అడుగడుగునా ఫాన్స్ కి ట్రీట్స్ ఇస్తున్నాడు. ఆయన అమెరికాలో వేసిన డ్రెస్సింగ్ స్టైల్ కి మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు. సూపర్ స్టైలిష్ గా మెగా హీరో అలా కనిపిస్తుంటే.. అభిమానులకి పూనకలొచ్చేస్తున్నాయి. గుడ్ మార్నింగ్ అమెరికా షో కోసం రామ్ చరణ్ యుఎస్ కి వెళ్లిన విషయం తెలిసిందే. యుఎస్ లో రామ్ చరణ్ పలు వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ లో వన్ అఫ్ ద హీరోగా రామ్ చరణ్ పాన్ ఇండియా స్టేటస్ ని గ్లోబల్ వైడ్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.
అయితే రామ్ చరణ్ కి హాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయా అనే ప్రశ్నకి రామ్ చరణ్ స్పందిస్తూ.. తాను ఇప్పుడు ఇండియా లోనే కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నానని, ఆ ప్రాజెక్ట్స్ తర్వాత అవుట్ సైడ్ ఇండియా (హాలివుడ్) నుండి ఏమన్నా ఆఫర్స్ వస్తే తప్పకుండా చేస్తానని, మీ టీం మేము మా టీం మీరు వర్క్ చేయాలని నేను కూడా అనుకుంటున్నానని రామ్ చరణ్ స్టైలిష్ గా హాలీవుడ్ ఎంట్రీ పై తన మనసులో మాట బయటపెట్టేసాడు.
దానితో మెగా ఫాన్స్ రామ్ చరణ్ క్లియర్ కట్ గా ఉన్నాడు, హాలీవుడ్ ఛాన్స్ వస్తే చరణ్ అస్సలు వదులుకోడు అంటూ పండగ చేసుకుంటున్నారు.