ఈమధ్యనే మాయోసైటిస్ అనే కండరాల వ్యాధి నుండి సమంత కోలుకుంది. అయినప్పటికీ ఆమె మొహంలో ఆ నీరసం అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడిప్పుడే సమంత షూటింగ్స్ కి హాజరవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ వెబ్ సీరీస్ చేస్తున్న సమంత తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి మూవీలో నటిస్తుంది. అంటే హైదరాబాద్ టు ముంబై అన్నట్టుగా ఆమె ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది. అయితే ఇదంతా కాస్త శ్రమతో కూడుకున్న పనే. అందుకే సమంత ఆ వర్కౌట్స్ కి కాస్త సెలవిస్తే బావుంటుంది అనేది అభిమానుల కోరిక.
సమంత మాయోసైటిస్ వ్యాధి నుండి మెల్లగా కోలుకుంటూ IVIG థెరపీ తీసుకుంటూనే జిమ్ లో మళ్ళీ ఎప్పటిలాగే వర్కౌట్స్ మొదలు పెట్టి చెమటలు చిందిస్తుంది. జిమ్ లో అతిగా వర్కౌట్స్ చేస్తూ మళ్ళీ నీరసం ఎందుకు తెచ్చుకుంటావ్ సమంతా.. కాస్త రెస్ట్ తీసుకో అనే సలహాలు ఇస్తున్నారు నెటిజెన్స్. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుండి కోలుకుంటున్నావ్.. నీవు సన్నగా, అందంగా, ఆకర్షణగానే ఉన్నావు.. ఎందుకంత శ్రమ పడుతున్నావ్ అంటూ అభిమానులు చెబుతున్నారు.
మరి సమంత సన్నగా మారాలనో.. లేదంటే ఇంకేదన్న కారణంగానో జిమ్ లో కష్టపడడం లేదు.. ఎందుకంటే ఆమె మానసికంగా బలపడడానికి మాత్రమే జిమ్ చేస్తుంది అంటూ సన్నిహితులు చెబుతున్నారు.