Advertisementt

బాలయ్య పిలుపు కోసం వెయిటింగ్: చరణ్

Thu 23rd Feb 2023 09:39 PM
balakrishna,ram charan  బాలయ్య పిలుపు కోసం వెయిటింగ్: చరణ్
Waiting to see when Balayya will call me to Unstoppable: Ram Charan బాలయ్య పిలుపు కోసం వెయిటింగ్: చరణ్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ అల్లు అరవింద్ కాంపౌండ్ లోకి వెళ్లి ఆహా టాక్ షో చెయ్యడం నిజంగా అభిమానులకు ఆశ్చర్యకర విషయమే. బాలకృష టాక్ షో అంతగా అదరణపొందుతుంది అని కూడా ఎవరూ ఊహించనైననూ లేదు. కానీ బాలకృష్ణ అద్భుతంగా అదరగొట్టేసి ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో ని టాక్ షోస్ కే నెంబర్ వన్ పొజిషన్ తెప్పించారు. కేవలం బాలయ్య వల్లే అది సాధ్యమైంది. అలాంటి షోకి స్టార్ హీరోస్ మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి వారు రావడం మరింత కలర్ ఫుల్ గా మారడానికి కారణమైంది.

అయితే ఈ షోకి ఇంకా మెగాస్టార్ చిరు, రామ్ చరణ్ రాకపోవడంపై ఇక్కడి మీడియానే కాదు.. అమెరికా లోని మన లోకల్ మీడియా కూడా ఫోకస్ చేసింది. అందులో భాగమే అమెరికాలో లోకల్ మీడియా అన్ స్టాపబుల్ పై రామ్ చరణ్ కి ప్రశ్న సంధించింది. దానితో రామ్ చరణ్ బాలకృష్ణ గారి అన్ స్టాపబుల్ టాక్ షో నిజంగా అన్ స్టాపబులే. ఆయన హోస్ట్ గా వస్తున్న ఆ షోకి టీఆర్పీ కూడా ఆకాశమే హద్దుగా ఉంది. ఆయ‌న ఆ టాక్‌షోకి ఎప్పుడు పిలుస్తారా.. అని ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నాను అంటూ చరణ్ అమెరికాలో మీడియాలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

రామ్ చరణ్ ప్రస్తుతం గుడ్ మార్నింగ్ అమెరికా షో కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ ఆ షో కన్నా ముందు మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ఇంతకుముందు చరణ్ ప్రభాస్ ఎపిసోడ్ లోను, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లోను బాలయ్య తో ఫోన్ కాల్ మాట్లాడాడు. మరి రామ్ చరణ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ లు అన్ స్టాపబుల్ సీజన్ 3 కి ఏమైనా హాజరవుతారేమో అని అభిమానులు వెయిటింగ్. 

Waiting to see when Balayya will call me to Unstoppable: Ram Charan:

Ram Charan interesting comments on Balakrishna Unstoppable talk show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ