Advertisementt

ఆ న్యూస్ ముందు తారక్ కే చెప్పాను: చరణ్

Thu 23rd Feb 2023 05:06 PM
ram charan,ntr  ఆ న్యూస్ ముందు తారక్ కే చెప్పాను: చరణ్
I told Tarak before that good news: Ram Charan ఆ న్యూస్ ముందు తారక్ కే చెప్పాను: చరణ్
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్-రామ్ చరణ్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ట్రిపుల్ ఆర్ సినిమా తీసినప్పుడు కాదు.. ఆ సినిమా ప్రమోషన్స్ అప్పుడు ప్రతి రోజూ మీడియాలో హైలెట్ అయ్యింది. తారక్-చరణ్ స్నేహాన్ని ఎన్టీఆర్-చరణ్ అభిమానులు బాగా ఎంజాయ్ చేసారు. వారిద్దరూ కలిసి స్టేజ్ పైకి వస్తే ఆ అల్లరి, ఆ సందడిని ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారు. అయితే ఇప్పుడు మరోసారి ఇంటర్నేషనల్ లెవల్లో తారక్-చరణ్ స్నేహం మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ అమెరికాకి గుడ్ మార్కింగ్ అమెరికా షోకి వెళ్ళాడు. అక్కడ షోలో చరణ్ తండ్రవుతున్నందుకు ఎలా ఫీలవుతున్నారు.. ఈ సంతోషాన్ని ఎలా అనుభవిస్తున్నారని ఆ షో యాంకర్ అడిగింది. 

దానికి చరణ్.. ఈ విషయం నిజంగా ఓ అందమైన అనుభూతిని కలిగిస్తుంది. ఉపాసనకు ఇన్నాళ్లుగా పెద్దగా దొరికేవాడిని కాదు.. ఇప్పుడు మాత్రం తప్పడం కాలేదు అంటూ ఫన్నీగా మాట్లాడాడు. ఈ సంతోషకమైన శుభవార్త మీ తల్లితండ్రుల తర్వాత ఎవరితో పంచుకున్నారని అడిగింది సదరు యాంకర్. దానికి రామ్ చరణ్ ముందుగా మా అమ్మా-నాన్నా (చిరు-సురేఖ)లతో ఈ శుభవార్త చెప్పాము. వాళ్ళు చాలా ఆనందించారు. ఈ శుభవార్త కోసం వాళ్ళు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు. ఇక నేను ఈ విషయాన్ని ప్రకటించేముందు నా బెస్ట్ ఫ్రెండ్ తారక్ కి ఫోన్ చేసి తాను తండ్రవుతున్న విషయాన్ని పంచుకున్నట్టుగా రామ్ చరణ్ ఆ వేదిక మీద చెప్పడం తారక్ ఫాన్స్ ని థ్రిల్ కి గురి చేసింది.

తాను-ఉపాసన తల్లితండ్రులవుతున్న మధుర క్షణాలని ఆనందిస్తున్నామని, మా మధ్యకి మూడో వ్యక్తిని ఆహ్వానిస్తునందుకు ఎంతో అనుభూతిని చెందుతున్నామంటూ ఆ వేదికపై తారక్ తో తనకున్న స్నేహాన్ని మరోసారి చాటారు చరణ్.

I told Tarak before that good news: Ram Charan:

Ram Charan: I told NTR about fatherhood

Tags:   RAM CHARAN, NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ