యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రకటన కోసం ఫాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. దానికి మేకర్స్ మాత్రమే కాదు.. ప్రకృతి కూడా సహకరించడం లేదు అనేలా ఉంది పరిస్థితి. ఎట్టకేలకి ఈ నెల 24 న NTR30 పూజా కార్యక్రమాలు పెట్టుకుంటే.. నందమూరి తారకరత్న అకాల మరణంతో అది పోస్ట్ పోన్ అయ్యింది. ఎన్టీఆర్ ఫాన్స్ ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పుడు ఈ ఓపెనింగ్ కార్యక్రమం మార్చ్ మొదటి వారానికి మారింది అని చెప్పుకుంటున్నారు. అదలాఉంటే.. NTR30 లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చెయ్యబోయే హీరోయిన్ విషయంలో ఇంక తర్జన భర్జలు ఏమి లేవు హీరోయిన్ ఫైనల్ అంటున్నారు.
శ్రీదే కుమార్తె జాన్వీ కపూర్ NTR30 హీరోయిన్ గా ఎంపికవడమే కాదు.. మొన్నామధ్యన ఫోటో షూట్ కూడా నిర్వహించి జాన్వీ కపూర్ లుక్ ని NTR30 టీమ్ ఫైనల్ చేసింది అంటున్నారు. ఇప్పుడు జాన్వీ కపూర్ ని NTR30 లోకి ఆహ్వానిస్తూ ఓ మంచి తేదీ నిర్ణయించి ప్రకటించబోతున్నారట. అది మార్చి 6నే, జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్ గా జాన్వీ కపూర్ పేరు NTR30 హీరోయిన్ గా అఫీషియల్ ప్రకటన చెయ్యబోతున్నారని తెలుస్తుంది.
అలాగే NTR30 విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని బాలీవుడ్ నుండే తీసుకురాబోతున్నారని, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కొరటాల శివ NTR30ని సెట్స్ మీదకి తీసుకువెళుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి.