ఢీ, రెడీ, నా అల్లుడు, హ్యాపీ, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరవడమే కాదు, రెడీ, ఢీ, బొమ్మరిల్లు సినిమాలతో హిట్స్ అందుకున్న జెనీలియా ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. బొమ్మరిల్లు సినిమాలో హహ హాసిని అంటూ అందరి మదిలో ముద్ర వేసిన జెనీలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని నటనకు దూరమయ్యింది. ఇద్దరి పిల్లలకి తల్లయిన జెనిలియా లాంగ్ గ్యాప్ తర్వాత తో భర్తతో కలిసి వేద్ మూవీతో హిట్ కొట్టింది. కమ్ బ్యాక్ కూడా స్ట్రాంగ్ హిట్ తో ఇచ్చింది.
అయితే తాజాగా తన కెరీర్ గురించి తాను నటనకు ఎందుకు దూరమయ్యిందో ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది జెనీలియా. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనుకున్నాను, పిల్లల కోసం పూర్తి సమయం కేటాయిస్తూ మంచి తల్లిగా మారాలనుకున్నాను, అందుకే సినిమాలకి, నటనకు దూరమయ్యాను. వేద్ సినిమా నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇకపై మంచి కథలు వస్తే, పాత్రలతో మళ్ళీ మీముందుకు వస్తాను.. అంటూ జెనీలియా తాను ఇన్నేళ్ళపాటు సినిమాలకి ఎందుకు దూరంగా ఉండాలనుకుందో చెప్పుకొచ్చింది.
రితేష్ దేశ్ ముఖ్, డైరెక్ట్ చేస్తూ హీరోగా తెలుగులో హిట్ అయిన నాగ చైతన్య-సమంత కలయికలో తెరకెక్కిన మజిలీ మూవీని జెనిలీయా హీరోయిన్ గా రీమేక్ చెయ్యగా.. అది హిందీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.