టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర తండ్రయ్యాడు. ఆయన భార్య పండండి మగ బిడ్డకి జన్మనిచ్చింది. నవీన్ చంద్ర తనకి కొడుకు పుట్టాడంటూ సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేసాడు. వారసుడి పాదాలని ముద్దాడుతూ దిగిన ఫొటోను పోస్ట్ చేసిన నవీన్ చంద్ర తన సంతోషాన్ని అభిమానలుతో పంచుకున్నాడు. నవీన్ చంద్ర భార్య పేరు ఒర్మా. వీరిద్దరికీ 2022లోనే అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజు తన భార్య ఓర్మా ప్రగ్నెంట్ అని చెప్పడమే కాకుండా, తన భార్యతో కలిసి బేబీ బంప్ ఫోటోలు కూడా పోస్ట్ చేసాడు. అది జరిగి 15 రోజులు పూర్తికాకుండానే తన చేతిలో బిడ్డని ఎత్తుకుని ముద్దాడుతూ సంతోషపడిపోతున్నాడు. నవీన్ చంద్ర తండ్రయిన విషయం తెలిసిన ఆయన స్నేహితులు, ఇండస్ట్రీ లోని ఫ్రెండ్స్ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక హీరోగా, విలన్ గా విభిన్న పాత్రలు చేస్తూ ప్రస్తుతం వెబ్ సీరీస్ తో సత్తా చాటుతున్న నవీన్ చంద్ర కెరీర్ లో బిజీగానే ఉంటున్నాడు. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లోను భార్య, బాబుతో హ్యాపీ గా బిజీ అవుతాడన్నమాట.