Advertisementt

కళ్యాణ్ రామ్ అన్నా నువ్ గ్రేట్: తారక్ ఫాన్స్

Wed 22nd Feb 2023 03:09 PM
kalyan ram,ntr fans  కళ్యాణ్ రామ్ అన్నా నువ్ గ్రేట్: తారక్ ఫాన్స్
Tarak fans appreciate Kalyan Ram కళ్యాణ్ రామ్ అన్నా నువ్ గ్రేట్: తారక్ ఫాన్స్
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ అన్నా నువ్వు గ్రేట్ అంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు. మా తారక్ అన్నని తండ్రిలా చూసుకుంటున్నావ్ అన్నా అంటూ కళ్యాణ్ రామ్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు. కళ్యాణ్ రామ్ గతంలో తన కుటుంబం కోసం ఎన్టీఆర్ ని అంతగా పట్టించుకోలేదు. ఎక్కువగా బాలకృష్ణ, చంద్రబాబు ఫామిలీస్ తోనే ఉండేవాడు. కానీ జానకి రామ్ మరణం తర్వాత హరికృష్ణకు ఇచ్చిన మాట ప్రకారం కళ్యాణ్ రామ్, తమ్ముడు ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే నందమూరి ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ ని ఆయన తల్లిని కాస్త దూరంగానే పెడతారు. 

ఎన్టీఆర్ పెళ్లి విషయంలో చంద్రబాబు నందమూరి ఫ్యామిలీని తారక్ కుటుంబాన్ని కలిపినా, తర్వాత టిడిపికి తారక్ ప్రచారం చేసినా.. మళ్ళీ ఎందుకో రెండు కుటుంబాల మధ్యన అగాధం ఏర్పడింది. బాలకృష్ణ అసలు ఎన్టీఆర్ ని పట్టించుకోరు.

ఎన్టీఆర్ కూడా కాస్త దూరంగానే ఉంటాడు. కానీ కళ్యాణ్ రామ్ అటు నందమూరి ఫ్యామిలీ కి దూరంగా ఉంటూ తమ్ముడు తారక్ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. ఇక హరికృష్ణ మరణం తర్వాత ఈ అన్నదమ్ముల మధ్యన మరింత అనుబంధం పెరిగింది. ఎక్కడికెళ్లినా అన్నదమ్ములిద్దరూ కలిసి వెళుతున్నారు. ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతగారిని స్మరించుకోవడం దగ్గరనుండి నిన్నగాక మొన్న తారకరత్న కోసం ఈ అన్నదమ్ములిద్దరూ బెంగూళూరుకి కలిసే వెళ్లారు. తారకరత్న మరణం తర్వాత ఆయన నివాసానికి కలిసి వచ్చారు. తారక్ ని విడవకుండా నందమూరి కుటుంబానికి దూరమైనా అండగా నిలబడుతున్నాడు కళ్యాణ్ రామ్.

ఇది చూసే ఎన్టీఆర్ ఫాన్స్ మురిసిపోతున్నారు. ఎన్టీఆర్ తో కలిస్తే నందమూరి కుటుంబం దూరం పెడుతుంది అని తెలిసినా, బాబాయ్ బాలయ్య పట్టించుకోరని తెలిసినా, కుటుంబానికి దూరమైనా తారక్ అన్నకి అండగా నిలుస్తూ నీ మంచి మనసుని చూపిస్తున్నావు అన్నా, నిజంగా గ్రేట్ అన్నా నువ్వు అంటూ కళ్యాణ్ రామ్ ని ఎన్టీఆర్ ఫాన్స్ నెత్తినపెట్టుకుంటున్నారు.

Tarak fans appreciate Kalyan Ram:

Kalyan Ram heartfelt support: NTR fans happy

Tags:   KALYAN RAM, NTR FANS