Advertisementt

అఖిల్ ఏజెంట్ కి కళ్ళు చెదిరే ఆఫర్

Wed 22nd Feb 2023 02:17 PM
sony liv,akhil agent  అఖిల్ ఏజెంట్ కి కళ్ళు చెదిరే ఆఫర్
Akhil Agent locks its OTT platform అఖిల్ ఏజెంట్ కి కళ్ళు చెదిరే ఆఫర్
Advertisement
Ads by CJ

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి లవ్లీ హిట్ తర్వాత అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మాస్ స్టైలిష్ ఎంటర్టైనర్ ఏజెంట్ మూవీ పాన్ ఇండియా లోని పలు భాషల్లో విడుదలకు సిద్దమవుతుంది. ఏప్రిల్ 28న ఏజెంట్ రిలీజ్ డేట్ ఇవ్వడమే టీమ్ ప్రమోషన్స్ లోకి దిగిపోయింది. అయితే ఏజెంట్ మూవీలో అఖిల్ మేకోవర్ కి అక్కినేని ఫాన్స్ మాత్రమే కాదు.. మాస్ ఆడియన్స్ మొత్తం ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలతో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆ అంచనాలు చూసే ఏజెంట్ డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటిటి సంస్థలు పోటీ పడ్డాయి. అయితే అమెజాన్-నెట్ ఫ్లిక్స్, డిస్ని ప్లస్ హాట్ స్టార్ కన్నా ఎక్కు మొత్తం కోట్ చేసి ఏజెంట్ మూవీ ఓటీటీ రైట్స్‌ను భారీ రేటుకి సోనీ లివ్  దక్కించుకున్నట్టు సమాచారం. ఏజెంట్ ఎన్ని భాషల్లో విడుదలవుతుందో అన్ని భాషలకి కలిపి 30 కోట్లకు పైగా ఏజెంట్ హక్కులని సోనీ లివ్ ఎగరేసుకుపోయినట్టుగా తెలుస్తుంది.

ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ ఏజెంట్ నుండి రొమాంటిక్ సాంగ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. హీరోయిన్ సాక్షితో అఖిల్ డ్యూయెట్ వేసుకుంటున్న ప్రోమో అది, పూర్తి సాంగ్ ఈ రోజు సాయంత్రం విడుదల చెయ్యబోతున్నారు మేకర్స్.

Akhil Agent locks its OTT platform:

Sony LIV Bags The Rights For Akhil Agent

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ