పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చాలా స్టైలిష్ గా స్లిమ్ గా ఉండేవారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాక లుక్స్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోవడం మానేశారు. అంతేకాకుండా కొద్దిగా బరువు కూడా పెరిగారు. ఎంతగా జిమ్ ట్రైనర్ ని మెయింటింగ్ చేస్తున్నా పవన్ బరువులో మార్పు లేదు. ఆయన దినచర్య అలా ఉంటుంది మరి. పాలిటిక్స్, అలాగే సినిమా షూటింగ్స్ తో ఆయనకి క్షణం తీరిక ఉండదు. ఇక సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక వకీల్ సాబ్ నుండి భీమ్లా నాయక్ వరకు ఒకే లుక్ ని మెయింటింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ స్టయిల్ పై ఫాన్స్ కి కంప్లైంట్స్ ఉన్నాయి.
రీసెంట్ గా బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో ఫాన్స్ ని తన లుక్ తో కూల్ చేసిన పవన్ కళ్యాణ్.. తాజాగా మరోసారి ఫిదా చేసారు.
ఈరోజు బుధవారం పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో క్రేజీ రీమేక్ సముద్రఖని దర్శకత్వంలో మొదలయ్యింది. ఈ ఓపెనింగ్ లో పవన్ కళ్యాణ్ స్టయిల్ కి ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. చాలా అంటే చాలా స్టయిల్ గా కాలు మీద కాలు వేసుకుని చైర్ లో కూర్చుని టీ తాగుతూ ఈ ఓపెనింగ్ లో పవన్ కనిపించారు. ఆ పిక్ లో పవన్ కళ్యాణ్ ఖాకి కలర్ ప్యాంట్ లో.. బ్లాక్ హుడిలో, బ్లాక్ షూస్ వేసుకుని అదిరిపోయారు. పవన్ కళ్యాణ్ న్యూ లుక్ ని ఫాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి మొదలు పెట్టేసారు.
ఎక్కువగా పొలిటికల్ డ్రెస్ వైట్ పంచె, వైట్ కుర్తిలోనే దర్శనమిస్తున్న పవన్ కళ్యాణ్ ఇలా మోడరన్ గా స్టైలిష్ డ్రెస్ వేసుకున్నప్ప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఫిదా అవుతూనే ఉన్నారు.