పవన్ కళ్యాణ్ వరస ప్రాజెక్ట్స్ తో హడావిడి చేస్తున్నారు. క్రిష్ తో పవన్ చేస్తున్న హరి హర వీరమల్లు ప్రోగ్రెస్ అప్ డేట్ ఇవ్వకుండానే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలు పెట్టేసిన పవన్ కళ్యాణ్ నెల తిరక్కుండానే.. సుజిత్-దానయ్య కలయికలో OG మొదలు పెట్టారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఎప్పుడు పట్టాలెక్కుతాయో క్లారిటీ లేదు. ఈలోపు సముద్ర ఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి తేజ్ తో కలిసి తమిళ రీమేక్ కి శ్రీకారం చుట్టారు.
నేడు పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలయికలో మూవీ అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో సైలెంట్ గా, సింపుల్ గా మొదలైపోయింది. త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సముద్రఖని దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కనుంది. నేడు బుధవారం పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ మూవీ రెగ్యులర్ షూట్ పై అప్ ఆటే రావాల్సి ఉంది. ఈ సినిమా ఓపెనింగ్ లో పవన్ సాయి తేజ్ తో డిస్కర్స్ చేస్తున్న పిక్స్ వైరల్ అయ్యాయి. మరి ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల డేట్స్ ఇచ్చారని, అలాగే తమిళ వినోదియ సిత్తంలో ఉన్న రోల్ కన్నా తెలుగులో పవన్ కళ్యాణ్ రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్, అలాగే నిడివి ఎక్కువ ఉండేలా త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్-మేనల్లుడు సాయి తేజ్ కాంబో మొదటిసారి పట్టాలెక్కుతుండడంతో ఈ చిత్రంపై ట్రేడ్ లోనూ, అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక అభిమానులైతే.. ఇది కల నిజం అవ్వడం కాదు, కలలో కూడా ఊహించనది జరగడం! వైజాగ్ లో ఆయన సినిమాలు కాలేజ్ మాని చూసిన దగ్గర నుంచి ఇంత వరకు.. అంటూ ఎగ్జైట్ అవుతున్నారు.