పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తుంది. కనీసం ఏడాదికో ట్రీట్ అయినా ఉంటుంది అని పవన్ ఫాన్స్ సంబరపడ్డారు. ఈ ఏడాది మాత్రం అది జరిగేలా కనిపించడం లేదు. వరసగా సినిమాలు మొదలు పెడుతున్నారు కానీ.. అవి ఎప్పుడు పూర్తవుతాయో చెప్పే పరిస్థితి లేదు. హరిహరవీరమల్లు షూటింగ్ మొదలు పెట్టి రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇంతవరకు టీజర్ లేదు, కనీసం రిలీజ్ డేట్ లాక్ చెయ్యకుండా మేకర్స్ సైలెంట్ గా ఉండిపోతున్నారు.
అయితే హరిహరవీరమల్లు అక్టోబర్ లో దసరాకి రిలీజ్ చేస్తారేమో అనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ విషయమై క్రిష్ కానీ, లేదంటే ఏఎం రత్నం గారు కానీ ఓ ప్రకటన ఇస్తే ఫాన్స్ చల్లబడతారు. శివ రాత్రికి పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు డేట్ ఇస్తారని ఆశపడినా అది జరగలేదు. జనవరి 26 రిపబ్లిక్ డే కి హరిహర వీరమల్లు టీజర్ అని ఊరించి ఉసూరుమనిపించారు. ఇప్పుడసలు షూటింగ్ అప్ డేట్ కూడా లేదు. డిసెంబర్ లో జరిగిన 45 రోజుల భారీ షెడ్యూల్ తప్ప మళ్ళీ కొత్త షెడ్యూల్ మొదలైన దాఖలాలు లేవు. ఈలోపు ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ OG లు ఓపెనింగ్ చేశారు.
ఇప్పుడు సముద్రఖని మూవీ ఓపెనింగ్ అంటున్నారు. ఇలా సినిమాలు ఓపెనింగ్స్ చేస్తూ మేకర్స్ ని కన్ఫ్యూజన్ లో పెట్టి.. ఫాన్స్ ని తికమక పెడుతున్న పవన్ కళ్యాణ్ హరి హరవీరమల్లు డేట్ ఒక్కటి వస్తే చాలు ఫాన్స్ కి పూనకాలే. మరి దసరా తప్పింది అంటే.. వచ్చే సంక్రాంతికి హరిహరవీరమల్లు రిలీజ్ ఉండొచ్చు. ఇప్పటికే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ని సంక్రాంతికి అంటున్నాడు. సో ఈ కన్ఫ్యూజన్ తీరాలంటే వీరమల్లు డేట్ ఇవ్వాల్సిందే.